PALLAVOTAVAM HELD _ తిరుమలలో వేడుక‌గా పల్లవోత్సవం

TIRUMALA, 28 JULY 2021: In view of the Birth Anniversary of Maharaja of Mysore, Pallavotsavam was held with religious fervour in Tirumala on Wednesday.

After Sahasra Deepalankara Seva, Sri Malayappa along with Sridevi and Bhudevi were offered special Harati at Karnataka Choultries by Mysore Samsthan and Karnataka Government representatives.

Maharani of Mysore Smt Pramoda Devi Vodayar, Endowments Principal Secretary of Karnataka Sri Manjunatha Prasad, Commissioner Endowments Smt Rohini Sindhuri, Tirumala temple staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో వేడుక‌గా పల్లవోత్సవం

తిరుమల, 2021 జులై 28: తిరుమలలో బుధవారంనాడు పల్లవోత్సవం వేడుక‌గా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హార‌తి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మైసూర్ ప్యాలెస్ మహారాణి శ్రీమతి ప్రమోదాదేవి వడయార్, కర్ణాటక రెవెన్యూ&దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మంజునాథ్ ప్రసాద్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి రోహిణి సింధూరి, శ్రీవారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.