CVSO INSPECTS OUTER CORDON IN TIRUMALA _ తిరుమల బాహ్య‌వ‌ల‌య ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సివిఎస్వో

TIRUMALA, 28 JULY 2021: The site inspection to take up second phase of Outer Cordon works was carried out by TTD Chief Vigilance and Security Officer Sri Gopinath Jatti at Tirumala on Wednesday.

As a part of providing foolproof security cover, TTD has already completed the first phase of works. To further strengthen the security, the sites being covered under the second cordon to be taken up were inspected.

CE Sri Nageswara Rao, EE 1 Sri Jaganmohan Reddy, AVSOs Sri Gangaraju, Sri Pavan Kumar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల బాహ్య‌వ‌ల‌య ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సివిఎస్వో

తిరుమల, 2021 జులై 28: తిరుమలలో భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని రెండో ద‌శ‌లో చేప‌డుతున్న బాహ్య‌వ‌ల‌య(ఔటర్ కార్డన్) ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌ను సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి బుధ‌వారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు.

ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌లో భాగంగా టిటిడి ఇదివ‌ర‌కే మొద‌టి ద‌శలో ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేయ‌డంలో భాగంగా రెండో ద‌శ బాహ్య‌వ‌ల‌య ప‌నులు చేప‌ట్టాల్సిన ప్రాంతాల‌ను అధికారులు ప‌రిశీలించారు.

సివిఎస్వో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఇఇ-1 శ్రీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఎవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ ప‌వ‌న్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.