PARUVETA OBSERVED WITH RELIGIOUS ENTHUSIASM _ తిరుమలలో ఘనంగా శ్రీవారి పార్వేటు ఉత్సవం

Tirumala, 16 Jan. 20: The traditional Hunt Festival, Paruveta Utsavam, was observed with utmost religious enthusiasm in Tirumala on Thursday.

Usually this fete is performed on the day of Kanuma. Lord Malayappa Swamy wearing armour, carrying all His weapons goes on a hunt in the wild wood to save the fauna from the attacks of wild beasts. Sri Krishna swamy varu on another palanquin also accompanied Lord Malayappa for this mock hunt fete.

Both the deities were seated in Paruveta Mandapam and Astanam was performed. After Harikatha Parayanam, Veda Stuti,  Annamacharya Sankeertana Nivedana,  Melam, the Lord proceeded majestically for mock hunt along with Sri Krishna Swamy.

Before the Hunting fete commenced, Sri Krishna Swamy was rendered ceremonious honours by Sannidhi Golla. Later, the priests on behalf of Lord threw the sharp weapons thrice and hunted the animals which are hiding in the bushes. The devotees who had converged to witness this mock hunt festival enjoyed the fete thoroughly.

Meanwhile TTD has cancelled all arjitha sevas for the day following the Paruveta Utsavam in Tirumala. 

Temple Priests Sri Venugopala Dikshitulu, Sri Anantasayana Dikshitulu, TTD EO Sri Anil Kumar Singhal, Deputy EO Sri Harindranath, VGO Sri Manohar and other temple staff, large number of devotees took part in this Hunt Festival.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమలలో ఘనంగా శ్రీవారి పార్వేటు ఉత్సవం
 
తిరుమల, 16 జనవరి  2020: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16వ తేదీ గురు వారం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. 
 
గురువారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహవచనం  జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు, స్వామివారు మండపమును వదలి ప్రాంగణమునకు వచ్చారు.
 
శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత ఆ గొల్ల సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి గొల్లకు బహుమానము జరిగింది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి వేలాదిగా భక్తులు విచ్చేసారు. శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది. 
 
ఈ ఉత్సవంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌,  శ్రీ , బోక్కసంసెల్‌ ఇన్‌చార్జ్‌ శ్రీ గురురాజస్వామి, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.