PARUVETA UTSAVAM HELD WITH RELIGIOUS JUBILATION IN NEW MANDAPAM _ నూతన మండపంలో ఘనంగా పార్వేట ఉత్సవం

MALAYPPA AS PANCHAYUDHAMURTY TAKES PART IN MOCK HUNT

PILGRIMS WELCOMING THE SPACIOUS RENOVATED MANDAPAM -TTD CHAIRMAN

STOP THROWING FALSE ALLEGATIONS FOR PERSONAL MILEAGE CHAIRMAN TO FAKE PROPAGATORS

TIRUMALA, 24 OCTOBER 2023: The grand “Mock Hunting Festival” that takes place on the day immediately after the Navaratri Brahmotsavams was observed with utmost religious fervour and elation in the newly renovated ancient centuries-old Paruveta Mandapam on Tuesday evening.

Speaking on the occasion, the TTD Chairman Sri Bhumana Karunakara Reddy told the media persons, for the first time, the Paruveta Utsavam is being observed in the newly renovated Paruveta Mandapam which is more spacious and convenient for the devotees to witness the grandeur of Sri Malayappa Swamy. 

The Chairman said, the age-old Paruveta Mandapam was renovated in a much comfortable and spacious manner which is appreciated by the devotees. He said, when the ancient mandapam was about to collapse, it was renovated by the TTD Engineering officials under the instructions of TTD EO Sri AV Dharma Reddy keeping in view both the convenience of performing the religious festival as well as the devotees.

“But it is so heart-rending when some persons make baseless allegations without knowing the facts for their personal and political mileage. All the officials and staff who are working in TTD are discharging their duties and responsibilities in the larger interests of the pilgrim devotees only. So, I appeal to those who are making baseless allegations to check the true facts as it is related to the sentiments of millions of devotees. Today, the devotees have expressed immense satisfaction and I am sharing the same with you all”, he maintained.

TTD EO Sri A V Dharma Reddy said the Paruveta Utsavam was held with utmost religious fervour in the newly renovated Mandapam. “We performed Jeernodharana and reconstructed the Mandapam at the same place as it is replicating the previous structure, taking photographs of each pillar, mandapam structure etc. Today the devotees have witnessed the festival with more satisfaction”, he added. 

Earlier, Sri Malayappa Swamy was brought from the Tirumala temple in a grand procession, and seated on the special platform in the Paruveta Mandapam. The artists of the Annamacharya Project rendered Annamacharya Sankeertans in a befitting in the manner with the famous notes like Vedamule Nee Nivasamata Vimala Narasimha, Kondalalo Nelakonna, Narayanate Namo Namo etc. While the Veda Parayanamdars rendered Mantras from religious texts matching the occasion. 

Later Sri Malayappa Swamy who appeared as Panchayudhamurthy wearing all sorts of weapons including Sword, Mace, Spear, Bow and Arrow besides Conch and Disc went for the mock Hunt and on behalf of the Sri Malayappa Swamy varu TTD EO Sri AV Dharma Reddy along with Archaka Sri Ramakrishna Deekshitulu threw the spear thrice recreating a wild beast hunt which was enjoyed by the devotees.

Later the processional deity of Sri Malayappa returned to the temple. TTD has cancelled all the arjitha sevas for the day following the festival.

CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, EEs Sri Jaganmohan Reddy, Sri Srihari, Temple DyEO Sri Lokanatham, Health Officer Dr Sridevi, DE Electrical Sri Ravishankar Reddy, VGOs Sri Bali Reddy, Sri Giridhara Rao, DyCF Sri Srinivasulu and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

నూతన మండపంలో ఘనంగా పార్వేట ఉత్సవం

– పంచాయుధమూర్తిగా పార్వేటలో పాల్గొన్న శ్రీ మలయప్ప

– ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో విమర్శించడం మంచిది కాదు : టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

– పాత మండపాన్ని యధావిధిగా పునర్నిర్మించాం : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 అక్టోబరు 24: తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు కూడా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. 

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యంత ప్రాచీనమైన, కూలడానికి సిద్ధంగా ఉన్న పార్వేట మండపాన్ని టీటీడీ అధికారులు అదేరీతిలో పునర్నిర్మించారని, భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అయితే, ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణంలో చూసి విమర్శించడం సరైన చర్య కాదని, అది పాజిటివ్ దృక్కోణమా, నెగెటివ్ దృక్కోణమా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. సద్విమర్శలు మాత్రమే చేయాలని, భగవంతునికి సంబంధించిన విషయాలలో అవి సలహాలుగా మాత్రమే ఉండాలన్నారు. టీటీడీలోని అర్చకులు, ఆగమపండితులు, ఉన్నతాధికారులు చక్కగా పనిచేస్తారని చెప్పారు. దురుద్దేశంతో మనకు వచ్చిన ఆలోచన మాత్రమే చాలా శాస్త్రీయమైనదని, మనం ఒక్కరమే గొప్పగా విమర్శలు చేయగలమని ఎవరైనా భావిస్తే అది చాలా తప్పిదం అవుతుందని చెప్పారు. ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. టీటీడీలోని అధికారులు ఎంతో భక్తితో పనిచేస్తారని, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తపన పడుతుంటారని అన్నారు.

వందల సంవత్సరాల కాలం నాటి నిర్మాణాలను ఉపయోగించకుండా ఉన్నప్పుడు కాపాడుకోవడం తేలికని, వాటిని ప్రతిసారీ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ప్రయోగాలు చేయకూడదని వివరించారు. పార్వేట మండపం చాలా పాతదని, కూలిపోయే స్థితిలో ఉండగా, చక్కగా పునర్నిర్మించారని, భక్తులందరూ అభినందిస్తున్నారని చెప్పారు. టీటీడీకి సంబంధించి విమర్శలు చేస్తే ఒక సలహా రూపంగా ఉండాలికానీ, ఎదుటివారిపై దాడి చేసేలా ఉండకూడదని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఏం మాట్లాడినా చెల్లుతుందని భావిస్తే భగవంతుని పట్ల అపచారం చేసినవారవుతారని అన్నారు.

టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నూతన మండపంలో పార్వేట ఉత్సవం చేయడం చాలా ఆనందదాయకమన్నారు. పాత మండపం శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని జీర్ణోద్ధరణ చేసినట్టు తెలిపారు. పాత మండపంలోని కళాఖండాలను రికార్డు చేసి యధావిధిగా తిరిగి నిర్మించామని, నూతన మండపం అద్భుతంగా వచ్చిందని చెప్పారు.

కాగా, శ్రీవారి ఆలయంలో ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిపై తిరుమలలోని పాపవినాశన మార్గంలో గల పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. శ్రీవారికి ఆస్థానం, నివేదన, హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వేదములే నీ నివాసమట విమల నారసింహా…., కొండలలో నెలకొన్న…, నారాయణతే నమో నమో… తదితర సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. తరువాత ఉభయదార్లకు తాళ్ళపాకవారికి, మఠంవారికి మర్యాదలు చేశారు. వేదపారాయణదారులు సందర్భానుసారంగా వేదమంత్రాలను పఠించారు. అనంతరం పంచాయుధమూర్తిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి శంఖం, చక్రంతోపాటు ఖడ్గం, గద, ఈటె, విల్లు, బాణం తదితర ఆయుధాలు ధరించి పా‌రువేటకు వెళ్లారు. శ్రీ మలయప్పస్వామివారి తరఫున టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో పాటు అర్చకులు శ్రీ రామకృష్ణ దీక్షితులు ఈటెను మూడుసార్లు విసిరారు. భక్తులు ఆనందంతో ఈ ఘట్టాన్ని తిలకించారు. దుష్టులను శిక్షించి భక్తులను రక్షించడమే ఈ పారువేట అంతరార్థం. ఆ తరువాత శ్రీమలయప్పస్వామివారు పార్వేట మండపం నుంచి మహాద్వారానికి వచ్చి హతీరాంజీవారి బెత్తాన్ని తీసుకొని సన్నిధికి వేంచేయడంతో పారువేట ఉత్సవం ముగుస్తుంది. ఈ ఉత్సవం కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఈఈలు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీ శ్రీహరి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శ్రీదేవి, డీఈ ఎలక్ట్రికల్‌ శ్రీ రవిశంకర్‌రెడ్డి, వీజీఓలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధరరావు, డెప్యూటీ సీఎఫ్‌ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.