PATTABHIRAMA SHINES ON HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం

TIRUPATI, 23 NOVEMBER 2022: On the fourth day evening of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor on Wednesday evening, Goddess Sri Padmavathi decked as Sri Pattabhirama, glided on Hanumantha Vahanam along the Mada streets encircling the shrine to bless Her devotees.

Both the seers of Tirumala,  JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham, Agama Advisor Sri Srinivasacharyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం 
 
తిరుపతి, 2022 నవంబర్ 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన  బుధవారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు అభయమిచ్చారు. 
 
అశ్వాలు, వృషభాలు, గజాలు  ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు . రాత్రి 7 నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ  చిన్నజీయర్‌స్వామి, జేఈవో 
శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసచార్యులు, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.