PAVITHROTSAVAMS BEGIN AT TONDAMANPURAM SRI VENKATESWARA SWAMY TEMPLE _ వైభవంగా తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

– PAVITRA PRATISHTHA AND VEDIC RITUALS PERFORMED AS PER AGAMA TRADITIONS

– THREE DAY FESTIVAL TO PRESERVE THE SANCTITY AND SPIRITUAL PURITY OF THE TEMPLE

Tirupati, August 26, 2026: The three-day Pavithrotsavams of Sri Venkateswara Swamy, along with Sri Devi and Bhu Devi, at Tondamanpuram began in a grand and devotional manner on Wednesday.

The rituals began in the morning with Suprabhatam, followed by Thomala Seva and Sahasranamarchana. The processional deities of Sri Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi were then taken to the Yagashala, where special Vedic rituals were performed. Chatushtarchana and Pavitra Pratishtha were subsequently conducted by the priests as per Agama traditions.

Special Vedic rituals will be performed in the Yagashala from 5.30 pm to 7.45 pm.

Pavithrotsavams to Preserve Temple Sanctity

Pavithrotsavams are conducted every year for three days to atone for any inadvertent lapses by pilgrims and staff and to preserve the sanctity of the temple. As part of the festival, sacred Pavitra Malas are offered to the deity and special rituals are performed.

Temple Deputy EO Smt. Nagarathna, Temple Inspector Sri Sudheer, temple priests and a large number of devotees participated in the rituals.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

వైభవంగా తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆగమశాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, వైదిక కార్యక్రమాలు

ఆలయ పవిత్రత, శ్రేయస్సు కోసం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు

తిరుపతి, 2026 ఆగస్టు 26: తొండమాన్‌పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేసి ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను అర్చకులు ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు.

సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు యాగశాలలో పలు ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఆలయ పవిత్రత పరిరక్షణకు పవిత్రోత్సవాలు

యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల నివారణతోపాటు ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి పవిత్రమాలలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుధీర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.