PAVITROTSAVAMS CONCLUDES IN SRI GT _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

TIRUPATI, 18 SEPTEMBER 2021: The annual Pavitrotsavams concluded in Sri Govindaraja Swamy temple in Tirupati on Saturday.

After the morning rituals, Snapana Tirumanjanam was performed to Sridevi, Bhudevi and Sri Govindaraja Swamy Utsava murthies followed by procession within temple premises in the evening. Purnahuti, Prabandha Sattumora, Veda Sattumora were performed between 7:30pm and 9:30pm.

Tirumala Sri Pedda Jeeyar, Tirumala Sri Chinna Jeeyar, Special Grade Deputy EO Sri Rajendrudu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

తిరుప‌తి, 2021 సెప్టెంబరు 18: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో శ‌నివారం రాత్రి పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

ఇందులో భాగంగా ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద‌యం 10.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, ప‌సుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు.

అనంత‌రం సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగించ‌నున్నారు. ఆ త‌రువాత రాత్రి 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, ప్ర‌బంధ శాత్తుమొర‌, వేద శాత్తుమొర నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఉత్స‌వ‌మూర్తులు కుంభం విమాన‌ప్ర‌ద‌క్షిణంగా స‌న్నిధికి వేంచేపు చేస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌ స్వామి, ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.