PAVITROTSAVAMS CONCLUDES WITH PURNAHUTI _ పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

Tirumala, 23 August 2018: The annual Traiahnika Pavitrotsavams concludes with Pavitra Purnahuti on Thursday.

Considered to be Dosha Pariharotsvam to the sins that were committed either knowingly or unknowingly by the temple priests or staffs or pilgrims throughout the year.

MahaPurnahuti was performed on in the Yagashala after Snapana Tirumanjanam to deities.

Tirumala Sri Pedda Jiyar Swamy, Sri Chinna Jiyar Swamy, JEO Sri KS Sreenivasa Raju were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల 23 ఆగస్టు 2018 ;తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారంనాడు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

తొలి రెండురోజుల్లాగానే గురువారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపనతిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.

కాగా, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాల నేపథ్యంలో గురువారంనాడు తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.