TRIAL-RUN GARUDA SEVA ON AUGUST 26_ఆగస్టు 26న మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

Tirumala, 23 August 2018: As a rehearsal to the preparations of the forthcoming twin mega religious events of annual and Navarathri brahmotsavams, a trial run of Garuda Seva replicating the brahmotsava Garuda Seva will be observed on Shravana Pournami day on Sunday.

All the departments have geared up for this dejavu fete, on August 26. Some cultural troupes will also perform before Garuda Seva vahanam.

The security, engineering works, Annaprasadam, water distribution, services by Srivari Seva volunteers, scouts and guides etc. will be observed by the authorities. Any specific changes required will be done before the main event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 26న మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమల 23, ఆగస్టు 2018 ;తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 26వ తేదీ ఆదివారం మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ నిర్వహించనున్నారు. ప్రతి పౌర్ణమినాడు తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

కాగా, సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు గాను ఆదివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.