PAVITROTSAVAMS IN APPALAYAGUNTA _ శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 02 SEPTEMBER 2021: The annual three-day Pavitrotsavams in Appalayagunta temple commenced on a grand religious note on Saturday. Due to covid restrictions, this annual festival will be observed within temple premises in Ekantam.
Snapana Tirumanjanam was performed to the Utsava Murthies of Sridevi Bhudevi Sameta Sri Prasanna Venkateswara Swamy with milk, honey, curd, coconut water and turmeric and Pavitra Pratista was performed by archakas amidst chanting of Vedic hymns.
Temple staff are present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2021 అక్టోబరు 02: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, కంకణ బట్టర్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.