PEDDASESHA VAHANAM OBSERVED _ పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌ ద‌ర్శ‌నం

Tirumala, 18 November 2020: On the occasion of Nagula Chaviti on Wednesday, Lord Sri Malayappa Swamy flanked by His two consorts Sridevi and Bhudevi paraded along four Mada streets on Pedda Sesha Vahanam for the first time in the last seven months ever since lockdown due to Covid in Tirumala.

The vahana Seva lasted for an hour. The devotees gathered in the galleries to witness the grandeur of Lord on the mighty serpent carrier following Covid norms.

Additional EO Sri AV Dharma Reddy, CEO SVBC Sri Suresh Kumar, EE Sri Jaganmohan Reddy, VGOs Sri Manohar, Sri Prabhakar, Peishkar Sri Jaganmohanachary and others were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌ ద‌ర్శ‌నం

తిరుమల, 2020 నవంబరు 18: నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీమలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, విఎస్వోలు శ్రీ మనోహర్, శ్రీ ప్రభాకర్, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.