PILGRIM MANAGEMENT UNDER THE SUPERVISION OF SENIOR OFFICERS_ టిటిడి సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నాలుగు మాడ వీధులు
Tirumala, Feb 12,2019: To ensure that every pilgrim get food and water that is being provided by TTD in the four mada streets, senior officers have been deployed to monitor the services by deputation staff, srivari sevakulu, scouts and guides.
Under the instructions of Tirumala JEO Sri KS Sreenivasa Raju, the overall supervision was done by FACAO Sri Balaji while for East Mada street DFO Sri Phani Kumar Naidu, South-EE Sri Krishna Reddy, West-Quality Control EE Sri Raviprabhakar, up to Varahaswamy temple in North Mada street EE Sri Nageswara Rao while from that point up to Vengamamba Annaprasadam Estates Officer Sri Vijaya Saradhi were pressed into service as supervisors.
They ensured that every pilgrim get all amenities like food, water, medical facilities to needy that are being providedby TTD with the help of Srivari Sevakulu.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నాలుగు మాడ వీధులు
తిరుమల, 12 ఫిబ్రవరి 2019: రథసప్తమినాడు భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు టిటిడి తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నాలుగుమాడ వీధుల్లో సీనియర్ అధికారులను నియమించారు. వీరు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని మరింత సమర్థవంతంగా సకాలంలో భక్తులకు సేవలందించే విధంగా చర్యలు చేపట్టారు.
నాలుగు మాడ వీధులకు కలిపి టిటిడి ఎఫ్‌ఎ ఆండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా, తూర్పు మాడ వీధిలో డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్ నాయుడు, దక్షిణ మాడ వీధిలో ఇఇ-7 శ్రీ జి.వి.కృష్ణారెడ్డి, పడమర మాడ వీధిలో క్వాలిటి కంట్రోల్ ఇఇ శ్రీ సి.హెచ్.రవిప్రభాకర్, ఉత్తర మాడ వీధిలో వరాహస్వామివారి ఆలయం వరకు ఇఇ-13 శ్రీ డి.నాగేశ్వరరావు, వరాహస్వామివారి ఆలయం నుండి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం వరకు ఎస్టేట్ అధికారి శ్రీ ఎల్. విజయసారథి భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. ఆయా మాడ వీధుల్లో వీరి పర్వవేక్షణలో ఇతర అధికారులు, ఉద్యోగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
గ్యాలరీల్లోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు
రథసప్తమినాడు శ్రీవారి వాహన సేవలు వీక్షించేందుకు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించారు. మొత్తం 5 లక్షల సర్వింగ్స్ చేశారు. మొత్తం 175 గ్యాలరీల్లో 55 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అన్నప్రసాద విభాగంలో 150 మంది సిబ్బంది, 550 మంది సులభ్ సిబ్బంది, 600 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్దేశించిన సమయంలో భక్తులకు అన్నపానీయాలు అందజేశారు. తాగునీరు, టి, కాఫి, పాలు, ఉప్మా, పొంగళి, సేమియా ఉప్మా, పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం, బిసిబెళా బాత్, టమోటా రైస్, సాయంత్రం సుండలు భక్తులకు పంపిణీ చేశారు. భక్తులకు 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందించారు.
టిటిడి అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భక్తుల సేవలో ఆరోగ్య విభాగం
రథసప్తమినాడు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మాడ వీధుల్లోని గ్యాలరీలతోపాటు ఇతర ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఈ విభాగం ఆధ్వర్యంలో 700 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 500 మంది శ్రీవారిసేవకులు సేవలందించారు. సాయంత్రం వరకు నాలుగు మాడ వీధుల్లో పోగయిన సుమారు 18 టన్నుల చెత్తను తరలించారు. గ్యాలరీలకు అనుబంధంగా ఉన్న మరుగుదొడ్ల వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
టిటిడి ఆరోగ్యశాఖాధికారి డా.. శర్మిష్ట, యూనిట్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసమూర్తి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.