CULTRAL PROGRAMMES ATTRACT PILGRIMS IN A BIG WAY_ ర‌థ‌స‌ప్త‌మి వాహన‌సేవ‌ల్లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

TIRUMALA, 12 Feb. 19: 
It’s been a day of festivity in Tirumala on the occasion of Radhasapthami.

About 24 teams comprising 360 artistes hailing from AP, TS, TN enthralled the pilgrims sitting in galleries with their unique performances.

Bandari Bhajana, Chekka Bhajana, Bandari Bhajana, Kolatams, Mayura Nrityam, visesha veshadharana attracted pilgrims in a big way.

NEMALI NATYAM BY A NANOGENARIAN STEALS THE SHOW

The rhythmic dance by a 92 year old Natarajan has stolen the show in the entire event.

Hailing from Madhurai of Tamilnadu, he has been performing Nemali Natyam in the brahmotsavams and special events of TTD from the past 50 years.

TTD EO Sri Anil Kumar Singhal appreciated his enthusiasm and will power.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ర‌థ‌స‌ప్త‌మి వాహన‌సేవ‌ల్లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

తిరుమల, 12 ఫిబ్రవరి 2019: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం ర‌థ‌స‌ప్త‌మి వాహ‌న‌సేవ‌ల్లో టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుండి 24 బృందాల్లో మొత్తం 360 మంది క‌ళాకారులు పాల్గొన్నారు. వీరు కోలాటం, చెక్క‌భ‌జ‌న‌, పండ‌రి భ‌జ‌న‌ త‌దిత‌ర క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా శ్రీ న‌ట‌రాజ‌న్ నెమ‌లి నృత్యం

వాహ‌న‌సేవ‌ల్లో నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో భాగంగా శ్రీ న‌ట‌రాజ‌న్ నెమ‌లి నృత్యం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. త‌మిళ‌నాడులోని మ‌ధురైకి చెందిన శ్రీ న‌ట‌రాజ‌న్‌కు 92 సంవ‌త్స‌రాలు. కోలాట బృందంలో నెమ‌లి పింఛాల‌తో కూడిన పొడ‌వాటి క‌ర్ర‌తో ల‌య‌బ‌ద్ధంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. ఈ వ‌య‌సులోనూ ఉత్సాహంగా పాల్గొన్న శ్రీ న‌ట‌రాజ‌న్‌ను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ప్ర‌త్యేకంగా అభినందించారు. టిటిడి నిర్వ‌హిస్తున్న బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి లాంటి ఉత్స‌వాల‌కు 50 ఏళ్లుగా వ‌స్తున్నాన‌ని శ్రీ న‌ట‌రాజ‌న్ తెలిపారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.