RADHASAPTHAMI OBSERVED WITH RELIGIOUS FERVOUR IN ALL LOCAL TEMPLES IN TIRUPATI_ టిటిడి అనుబంధ ఆలయాలలో వైభ‌వంగా రథసప్తమి

Tirupathi, 12 Feb 19:The annual fete Surya Jayanthi was observed with religious fervour in the local temples of Sri Kodandarama Swamy and Sri Govindaraja Swamy temples in Tirupati on Tuesday.

In Sri Govindaraja Swamy temple also the Lord was taken on a celestial procession on seven vahanams while in Sri Kodandarama Swamy temple Sri Ramachandra Murthy was taken on a celestial ride on Surya prabha vahanam in the morning and on Chandra Prabha Vahanam in the evening.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సప్తవాహనాలపై శ్రీ గోవిందరాజస్వామివారు

తిరుపతి, 2019 ఫిబ్ర‌వరి 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు.మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 3.30 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీ‌హ‌రి,టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ‌మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి అనుబంధ ఆలయాలలో వైభ‌వంగా రథసప్తమి

టిటిడి అనుబంధ ఆల‌యాలు తిరుపతిలోని శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీకోదండరామస్వామివారి అలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినాని మంగ‌ళ‌వారం అత్యంత‌ వైభంవ‌గా నిర్వ‌హించారు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభవాహనం స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ శ్రీ‌ధ‌ర్‌, ఏఈవో శ్రీ తిరుమ‌ల‌య్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. అనంతరం ఆలయంలో ఆస్థానం చేపట్టారు.

చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ….

చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో ఆస్థానం నిర్వహించారు.

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ….

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ….

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహన సేవలు, తిరుచ్చి ఉత్సవంపై స్వామివారు ఊరేగి భక్తులను కటాక్షించారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది.

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో 6 నుండి 7 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.