PILGRIMS LAUDS TTD EO FOR RECENT INITIATIVES _ శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యత, రుచి మరింత పెంచుతాం – టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు

TTD EO ATTENDS HIS MAIDEN DIAL YOUR EO

TIRUMALA, 02 AUGUST 2024: The pilgrims callers poured in laurels for the recent initiatives brought in the last one and a half months by the TTD Executive Officer Sri J Syamala Rao in increasing the number of SSD tokens, enhancing the quality of Annaprasadam and   Laddu Prasadam in Tirumala.

While attending to the pilgrims callers during his maiden one hour live phone in “Dial Your EO” programme held at Annamaiah Bhavan on Friday, the TTD EO answered 33 devotees’ calls which mostly included on the darshan and accommodation bookings, Srivari Seva online services, quality of Laddu and Dharma Prachara activities. 

Answering to the callers, the EO said many changes were brought recently for the benefit of common devotees. The SSD tokens have been increased from 1.05lakh to 1.47lakh tokens per week to avoid waiting time for pilgrims in queue lines besides restricting the SRIVANI tickets in offline to 1000. 

He also said, the quality of Annaprasadam being served at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex and Srivari Laddu Prasadams have also been enhanced. Even the big and small hotels, other eateries in Tirumala are being instructed to serve qualitative and hygienic food at affordable prices to the multitude of visiting pilgrims in Tirumala as the health safety of devotees is also one of the top most priorities of the TTD.

Some other excerpt suggestions from pilgrim callers included review on the lease policy of TTD Kalyana Mandapams, safeguarding the TTD land located at Tiruttani, unhygienic environment prevailing in Sapthagiri Rest House in Tirumala, darshan to other Para Military Forces through Supatham, route maps in Dharma Ratham buses and many more. Answering all the callers, the EO said the suggestions will be reviewed and appropriate decision will be taken after a thorough analysis with the concerned departments.

Additional EO Sri Ch Venkaiah Chowdhary, JEOs Smt Goutami, Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and others officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యత, రుచి మరింత పెంచుతాం – టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు

తిరుమ‌ల‌, 2024 ఆగస్టు 02: శ్రీవారి లడ్డు ప్రసాదాల రుచి, నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు.

తిరుమల అన్నమయ్య భవనంలోని మీటింగ్ హాల్‌లో శుక్ర‌వారం జ‌రిగిన‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో 33 మంది భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. విజయలక్ష్మి –

ప్రశ్న : టీటీడీ ట్రస్ట్ లకు విరాళాలు ఇచ్చిన దాతలను దర్శనానికి ఎక్కడినుండి పంపుతారు.

ఈవో : దాతలను సుపథం నుండి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

2. చంద్ర కిరణ్ – ప్రకాశం జిల్లా,

ప్రశ్న : టీటీడీ భ‌క్తుల‌కు అందిస్తున్న వ‌స‌తి, ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాలు త‌దిత‌ర సౌక‌ర్య‌లు బాగున్నాయి.

ఈవో : ధ‌న్య‌వాదాలు, ఇటువంటి ప్రశంసలు మాకు, మా ఉద్యోగులందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయ‌ని, మరింత ఉత్సాహంతో భ‌క్తులకు మెరుగైన‌ సేవలు అందిస్తామ‌న్నారు.

3. వెంకటేశ్వర్లు – హైదరాబాద్,

ప్రశ్న : శ్రీవారి ఆలయంలో తోపులాట ఎక్కువగా ఉంది. ఆడవాళ్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చర్యలు తీసుకోండి.

ఈవో : టీటీడీ విజిలెన్స్ విభాగము, అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటారు.

4. శ్రీనివాస్ – తెలంగాణ,

ప్రశ్న : టిటిడి కళ్యాణ మండపాలు లీజుకు తీసుకొని ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆధునీకరించాం, మా పరిస్థితి ఏమిటి.

ఈవో : కళ్యాణ మండపాల లీజు పాలసీని పరిశీలిస్తున్నాము, మా అధికారులు మీతో మాట్లాడతారు.

5. పూర్ణ చంద్రశేఖర్ – మచిలీపట్నం,

ప్రశ్న : శ్రీవారిని దూరం నుంచి చూడటం వల్ల వయసు రిత్యా
కనబడుటలేదు. వీలైనంత దగ్గరగా దర్శనం కల్పించండి.

లడ్డు ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోండి.

ఈవో: రద్దీ అధికంగా ఉండడం వలన దగ్గరగా దర్శనం కల్పించడం వీలుకాదు. లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టాం.

6. సంధ్య రాణి – సూర్యాపేట,

ప్రశ్న : శ్రీవారి సేవకు వస్తుంటాం. ఏదైనా సమస్య వల్ల మా గ్రూప్ లోని సభ్యులు రాలేక పోతే వేరొకరికి అవకాశం కల్పించండి.

ఈవో : వీలు కాదు.

7. శేఖర్ – తిరుపతి

ప్రశ్న : తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం మూలమూర్తుల పాదాల వద్ద హనుమంతుడి విగ్రహం కనిపించేలా ఉంచండి.

ఈవో : సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తాం.

8. లక్ష్మణ్ – చిలకలూరిపేట,

ప్రశ్న : తిరుమలలోని వసతి గదులలో ఎలుకలు ఉన్నాయి, శ్రీవారి ప్రసాదాలను తింటున్నాయి. అందువల్ల ఇంటికి తీసుకు వెళ్లలేక పోతున్నాం.

ఈవో : మీరు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలి. త్వరలోనే తనిఖీలు చేసి సమస్యలు పరిష్కరిస్తాం.

10. మనోజ్ – ఛత్తీస్ ఘడ్

ప్రశ్న : సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ తదితర కేంద్ర భద్రత బలగాలకు శుభథం ద్వారా దర్శనం కల్పించండి.

ఈవో : ఇప్పటికే ఉంది, పరిశీలిస్తాం.

11. అరుంధతి- హైదరాబాద్

ప్రశ్న : ఇటీవల ఆన్ లైన్ లో సుప్రభాత సేవ దొరికింది, నేను నడవలేను, స్వామివారి దర్శనం కల్పించండి.

ఈవో : బయోమెట్రిక్ ద్వారా మీకు స్వామి వారి దర్శనం కల్పిస్తాము.

12. దేవానంద్ – తిరుపతి

ప్రశ్న : 9 నెలల క్రితం టిటిడిలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంతవరకు వ్రాత పరీక్ష నిర్వహించలేదు.

ఈవో: త్వరలో ఏఈఈ నియమకాలను పూర్తి చేస్తాం.

13. రాజేష్ – తెలంగాణ

ప్రశ్న : శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు.

ఈవో : శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నాం.

14. శ్రీనివాస్ – విశాఖపట్నం

ప్రశ్న : పరకామణి సేవకు వస్తుంటాను, మాకు టెంపుల్ డ్యూటీ వెయ్యండి.

ఈవో : మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.

15. శ్రీనివాస్- తెనాలి

ప్రశ్న : నేను అన్నమాచార్య సంకీర్తనలను ప్రచారం చేస్తున్నాను. ప్రతి జిల్లాలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా గోవింద నామాలు, భజనలు ప్రచారం చెయ్యండి.

ఈవో : మా అధికారులు మీతో మాట్లాడి సూచనలు స్వీకరిస్తారు.


16. ప్రసన్నకుమార్ – విశాఖపట్నం

ప్రశ్న : రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో దొరకడం లేదు, ఎక్కడ ఏదో పొరపాటు జరుగుతోంది.

ఈవో : ఈనెల 24వ తేదీ ఆన్లైన్లో 4.5 లక్షల టికెట్లు విడుదల చేశాము, ఒక గంటలోనే అన్ని టికెట్లు అయిపోయాయి. అన్ని సేవలకు దాదాపు 20 లక్షల మంది లాగిన్ అయ్యారు. టీటీడీ ఐటీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, ఎలాంటి సమస్యలు లేవు.

17. భాస్కర్ – కడప

ప్రశ్న : శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టుకు ఉచిత బస్సు ప్రయాణ సమయాలు, తిరుమలలో ఉచిత బస్సులు ఏఏ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి తదితర అంశాలపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయండి.

శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం టికెట్లు పొందిన భక్తులకు సుపథం ద్వారా దర్శనం కల్పించండి.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండులో ఫ్రీ ఎంట్రీ సమాచారం ఇవ్వడం లేదు.

ఈవో : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రీఎంట్రీ సమాచారంపై బోర్డులు ఏర్పాటు చేశాం. మిగిలిన అంశాలపై చర్యలు తీసుకుంటాం.

18. నాగరాజన్ – నగిరి

ప్రశ్న : తిరుత్తని లో టీటీడీ స్థలము ఉంది, ఈ స్థలం ఆక్రమణలకు లోనవుతుంది. ఇందులో కళ్యాణ మండపం నిర్మించండి.

ఈవో చర్యలు తీసుకుంటాం మా అధికారులు మీతో సంప్రదిస్తారు.

19. ముని లక్ష్మి – నెల్లూరు

ప్రశ్న: మీరు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు మార్పులు తీసుకువచ్చారు. పివిఆర్ కే ప్రసాద్ గారు ఈవో గా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి.

శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతికి సంబంధించి మూడు నెలలకు ముందు విడుదల చేయడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. ఒకటి లేదా రెండు నెలలు ముందు విడుదల చేయండి.

దర్శనం టికెట్లు క్యాన్సిల్ చేసుకుని అవకాశం కల్పించండి. తద్వారా మళ్ళీ సేవా టికెట్లు పొందేందుకు అవకాశం కలుగుతుంది.

ఆర్జిత సేవలు వర్చువల్ సేవలు ఒకే తేదీలో కాకుండా వేర్వేరు తేదీల్లో విడుదల చేయండి.

ఈవో : ధన్యవాదాలు, ఆర్జిత సేవలలో మార్పులు వీలు కాదు. టికెట్లు క్యాన్సిల్ చేసుకునే అవకాశం పరిశీలిస్తాం.

20. అలేఖ్య – తిరుపతి

ప్రశ్న : టిటిడి పుస్తక విక్రయశాలల్లోటిటిడి ప్రచురణలు అందుబాటులో ఉంచండి.

ఈవో : తప్పకుండా.

మరికొందరు భ‌క్తులు శ్రీవారి సేవ, దాతలు, వ‌యో వృద్ధులు వసతి మరియు దర్శనంకు సంబంధించి త‌మ‌ అభిప్రాయాన్ని తెలిపారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.