POURNAMI GARUDA SEVA OBSERVED _ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

Tirumala, 2 Sep. 20: The monthly Pournami Garuda Seva was observed in the Tirumala temple on Wednesday evening between 5pm and 6pm.

As part of it, the utsava idol of Sri Malayappaswamy was seated elegantly on His favourite Garuda vahanam at the Ranganayakula mandapam in Srivari temple and observed in Ekantam in view of Covid-19 restrictions.

HH Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Chinna Jiyar Swamy of Tirumala temple, DyEO Sri Harindranath were also present.

SED QUOTA INCREASED

Meanwhile, TTD has increased Rs.300 Special Entry Darshan ticket quota booking in on-line by 1000 every day starting from Wednesday onwards.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 02: తిరుమలలో బుధ‌‌వారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా  సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించారు.  

కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు గ‌రుడ వాహ‌న సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.    

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పెంపు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సౌకర్యం కోసం బుధవారం నుంచి రూ.300 టికెట్ల కోటా పెంచడం జరిగింది. గంటకు 100 చొప్పున రోజుకు 1000 టికెట్లను ఆన్ లైన్ ద్వారా అదనంగా కేటాయిస్తారు

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.