PRAYED LORD FOR SECURITY OF NATION AND PROSPERITY OF PEOPLE OF INDIA -MP CM _ దేశ భ‌ద్ర‌త, ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం శ్రీవారిని ప్రార్థించా : మధ్య ప్రదేశ్ సీ ఎం శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

LAUDS SUNDARAKANDA PATHANAM PROGRAM BY TTD

Tirumala, 27 Jun. 20: The Honourable CM of Madhya Pradesh Sri Shivraj Singh Chouhan said he prayed Lord Venkateswara for the security of the nation and prosperity of the people of the country. 

The Head of the State of MP had darshan along with his family on Saturday in Tirumala. After Darshan of Lord, he was offered Vedasirvachanam by pundits at Ranganayakula Mandapam. TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy presented Theertha Prasadams and Laminated photo of Lord. CVSO Sri Gopinath Jatti was also present.

Later the CM of MP also participated in Sundarakanda Pathanam programme at Nadaneerajanam Mandapam in Tirumala. Then he offered Coconuts at Akhilandam and fulfilled his wish.

Speaking to media later he said, the entire country is going through a tough time right now with the increasing Corona cases on one hand and tensions at Border. “Today I prayed Lord Venkateswara to bestow His benign blessings and protect the nation from the clutches of Corona Virus and from tensions prevailing at Border. Complimenting Sundarakanda Pathanam programme mulled by TTD, he said, I feel it as a privilege to take part in Sundarakanda Pathanamthis. It will definitely provide a solution to all our problems”, he asserted.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

దేశ భ‌ద్ర‌త, ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం శ్రీవారిని ప్రార్థించా : 
 
సుందరకాండ పారాయ‌ణం సమస్యలకు పరిష్కారం చూపుతుంది :  మధ్య ప్రదేశ్ సీ ఎం శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
 
తిరుమల, 2020 జూన్ 27: కరోనా బారి నుంచి దేశ ప్రజలంతా బయట పడి ఆరోగ్యాంగా ఉండాలని, దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోవాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని  మధ్యప్రదేశ్ ముఖ్య‌‌మంత్రి  శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్  తెలిపారు. సుందరకాండ పారాయణం దేశంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం శ్రీ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు సీ ఎం  కు వేదాశీర్వచనం చేశారు.  ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి సీఎం కు స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాదనీరాజన వేదిక మీద టీటీడీ నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం అఖిలాండం వద్ద స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. 
 
ఆతరువాత   శ్రీ చౌహాన్  మీడియాతో   మాట్లాడారు. దేశంలో రోజురోజుకు   పెరుగుతున్న కరోనా కేసులు, స‌రిహ‌ద్ధుల్లో ఉద్రిక్తతలతో దేశం మొత్తం ఆందోళనలో ఉంద‌న్నారు.  కరోనా వైరస్ బారి నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌మ‌ని,  సరిహద్దులో  నెలకొన్న  ఉద్రిక్తతల నుండి దేశాన్ని రక్షించమని శ్రీ‌వారి  ప్రార్థించిన‌ట్లు  ఆయన తెలిపారు. ప్ర‌పంచ మాన‌వాళిని  అశాంతి, ఆనారోగ్యం నుంచి  దూరం చేసి  ఆరోగ్యం ప్ర‌సాదించాల‌ని శ్రీవారిని  ప్రార్థిస్తూ టిటిడి నిర్వ‌హిస్తున్న‌ సుందరకాండ పారాయ‌ణం కార్యక్రమాన్ని అభినందించారు.  స్వామివారి అనుగ్ర‌హంతో సుందరకాండ పారాయ‌ణంలో పాల్గొనడం మ‌ధురానుభూతి కలిగించిందన్నారు. ఈ పారాయ‌ణం స‌మస్యలన్నింటికి ఖచ్చితంగా పరిష్కారం అందిస్తుంది “అని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.   
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.