PUSHPAYAGAM HELD AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం

Tirupati, 27 Jun. 20: The annual Pushpayagam held at Sri Govindaraja Swamy temple in Tirupati on Saturday. 

This fete is usually performed as Sin Free festival to the omissions and commissions committed either knowingly or unknowingly by religious staff,  employees and devotees during annual brahmotsavams.

It may be mentioned that annual fete took place in the temple between May 28 and June 5. 

The deities were seated on a special platform and floral fete performed between 3pm and 5pm with tonnes of traditional flowers. The entire ritual was performed by Chief Priest Sri Srinivasa Dikshitulu. 

Spl.Gr.DyEO Smt Vara Lakshmi was present  

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం

తిరుపతి, 2020 జూన్ 27: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ‌ని‌వారం పుష్పయాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

అనంతరం ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు, కంక‌ణ భ‌ట్ట‌ర్‌ శ్రీ ఎ.పి. శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం జరిగింది. ఇందులో చామంతి, సంపంగి, రోజా, మ‌ల్లెలు, లిల్లీ, మొల్ల‌లు, క‌న‌కాంబ‌రం, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలు, తుల‌సి, మ‌రువం, బిల్వం, ప‌న్నీరాకు వంటి పత్రాల‌తో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు.

ఆల‌యంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్ర‌హ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, పుష్ప‌యాగం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జియ్య‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్య‌ర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, సూపరింటెండెంట్లు‌ శ్రీ రాజ్‌కుమార్, శ్రీ శ‌ర్మ‌ టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.