PRIORITY TO COMMON DEVOTEES AT TIRUMALA _ తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌

  • NO HIKE IN TARIFF OF SRIVARI ARJITHA SEVAS AND DARSHAN 

– DELICIOUS ANNAPRASADAM DEPENDING ON DEVOTEES CROWDS 

– TTD CHAIRMAN SRI YV SUBBA REDDY

 Tirumala, 04 March 2022: TTD Chairman Sri YV Subba Reddy said on Friday that TTD is making every effort to provide delicious Anna Prasadam as per traditional habits and comfortable Srivari Darshan to common devotees.

Speaking to media after inspecting Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex (MTVAC) and luggage Center at PAC-4 (Old Anna Prasadam Bhavan) along with officials, TTD Chairman said that its been over a week’s time since Sarva Darshan for common devotees has been commenced after a gap of almost two years. The devotees rush has been increasing remarkably, he added.

He directed officials of Anna Prasadam to make all arrangements to provide quality Anna Prasadam etc. to devotees as per increasing numbers.

Similarly for the convenience of devotees of North India rotis and chapattis will also be served. The officials concerned are instructed to make arrangements to distribute Anna Prasadam at two locations in Tirumala.

He said officials are making all efforts to commence full-fledged arjita sevas from April onwards.

He also reiterated that TTD has not hiked the tariff of arjita sevas and Darshan tickets and there was only a routine discussion at the TTD board meeting recently on the issue.

He said it was the endeavour of TTD board to provide quicker and hassle-free Srivari Darshan to common devotees and all out efforts are made to reduce the VIP Darshans.

TTD CVSO Sri Gopinath Jatti, DyEO of Anna Prasadam, Sri Harindranath, VGO Sri Bali Reddy and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌

– శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌నాల ధ‌ర‌లు పెంచ‌లేదు

– భ‌క్తుల ర‌ద్దీకి అనుగుణంగా రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు

– టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2022 మార్చి 04: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే సామాన్య భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం, రుచిక‌ర అన్న‌ప్ర‌సాదాలు అందించ‌నున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, పిఏసి – 4 (పాత అన్న‌ప్ర‌సాద భ‌వనం) లోని ల‌గేజి సెంట‌ర్‌ను శుక్ర‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి ఛైర్మ‌న్‌ త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కార‌ణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత సామాన్య భక్తులకు సర్వదర్శ‌నం ప్రారంభించి పదిరోజులవుతోంద‌న్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత తిరుమ‌ల‌లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింద‌న్నారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా అల్ఫాహ‌రం, అన్నప్రసాదాలు అందించేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఉత్తర భారతదేశం నుండి వచ్చే భక్తులకు భోజనంతో పాటు రొట్టెలు, చపాతీలను అందిస్తామ‌న్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుంద‌ని, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నార‌ని చెప్పారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సామాన్య భ‌క్తుల‌కు అందించే ఆర్జిత సేవలు, ద‌ర్శ‌నాల ధ‌ర‌ల‌ను టిటిడి పెంచ‌లేద‌ని,పెంచే ఆలోచన ఇప్పట్లో లేద‌న్నారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగింద‌న్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమ‌ని, ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి ద‌ర్శ‌నాలను రద్దు చేశామని, దీని వల్ల సర్వదర్శనం టోకెన్లు పొందే సామాన్య భక్తులకు అదే రోజు దర్శనం జరుగుతోందని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. కొండ మీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు ఈ త‌నిఖీల్లో ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.