PROCESSION OF KALPAVRUKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడి వైభవం

Srinivasa Mangapuram, March 4, 2013: On the fourth day of Sri Kalyana Venkateswara Swamy Temle Brahmotsavam, Lord Kalyana Venkateswara along with His consorts being the boon giver takes ride on Kalpa Vruksha to bless his devotees with their sought after and wishful desires for which they vow to serve and worship him whole-heartedly.
 
On the celestial tree Kalpa Vruksha vahanam, Lord Kalyana Venkateswara went on a pleasure ride around the four-mada streets surrounding the temple giving darshan to thousands of people to witness the grand procession in the ongoing Brahmotsavams. Legend says that Kalpa Vruksha was one of the elements that erupted when the Adisesha placed his vice grip on the Mandara Mountain where the Devatas- Demons tried to steal the Amrutam (celestial liquid).
 
Srimad Bhagavatham says that all those who took shelter under Kalpa vruksha will not have problems of starvation and poverty. The use of Kalpa Vruksha vahanam by Lord Venkateswara also denotes the importance given to environment, greenery and promotion of forests and cleans and pollution free atmosphere.
 
Legends also hail Lord Venkateswara himself as a ‘Kalpa Vriksha’ as he blesses every devotee with boons sought by them. The Kalpa Vruksha Vahanam of Lord Venkateswara is  a magnificent sight of greenery as it is adorned with not only Kalpa Vruksha but also with the celestial elements of  Kamadhenu and Chintamani which are also known for granting all boons to their devotees indicating that Lord Venkateswara was embodiment of all the three  divine elements.
 
TTD Joint Executive Officer Sri P.Venkatarami Reddy, CV&SO Sri GVG Ashok Kumar DyEO Smt. Reddamma, V&S.O Sri Hanumanthu, Temple staff and large number of devotees took part.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
 

కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడి వైభవం

తిరుపతి, మార్చి 4, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలూ శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.
కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నాలుగవ నాటి రాత్రి సమస్త రాజ లాంఛనాలతో సర్వభూపాల వాహనసేవ అద్భుతంగా ఉంటుంది. భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. మా ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్‌ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి ఊరేగడమే సర్వభూపాల వాహనసేవ.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉదయం శ్రీమతి ఎస్‌.కె.స్వర్ణకుమారి శ్రీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం, శ్రీమతి అన్నపూర్ణ పురాణ ప్రవచనం, కనకమహాలక్ష్మి బృందం సంప్రదాయ భక్తి సంగీతం కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం తిరుపతికి చెందిన శ్రీ సముద్రాల థరథ ధార్మికోపన్యాసం, తిరుపతికి చెందిన వై.వెంకటేశ్వర్లు హరికథ వినిపించారు. సాయంత్రం శ్రీ ప్రమోద చైతన్యస్వామి ఆధ్యాత్మికోపన్యాసం, తితిదే ఆస్థాన గాయకులు శ్రీ జి.బాలకృష్ణప్రసాద్‌ అన్నమయ్య విన్నపాలు సంగీత కచేరి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, విజిఓ శ్రీ హనుమంతు, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మణ్‌ నాయక్‌, తితిదే సూపరింటెండెంట్‌ ఇంజినీరు శ్రీ సుధాకరరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శ్రీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.