PROCESSION OF SPECIAL UMBRELLAS FROM CHENNAI ON OCT 4 _ గరుడవాహనం రోజున శ్రీవారికి ప్రత్యేక గొడుగు

TIRUMALA TIRUPATI DEVASTHANAMS: PRESS RELEASE

Tirumala,Oct 2: In view of the annual brahmotsavams, the Chennai-based Tirupati Umbrella Charities and Hindu Dharmartha Samiti will be donating special umbrellas for Srivari Garuda Seva and the procession will start from Chennai on October 4th and 6th respectively and the umbrellas will reach Tirumala on October 9, on Garuda Seva day.

However it is appealed that the pilgrims and devotees are requested not to offer cash or kind offerings to both Tirupati Umbrella Charities and Hindu Dharmartha Samiti during the procession of holy umbrellas from Chennai to Tirumala since the donations offered by the pilgrims will not be credited in the account of TTD or Srivari Hundi by the said charities.

The Chennai police are also requested to stop the hundi collections if any during procession.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER TIRUPATI

గరుడవాహనం రోజున శ్రీవారికి ప్రత్యేక గొడుగు

తిరుమల, 02  అక్టోబరు 2013 : ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 5వ రోజున జరుగనున్న గడుడసేవలో శ్రీవారికి కానుకగా  సమర్పించే చెన్నైకి చెందిన ప్రత్యేక గొడుగులు ఈ ఏడాది కూడా హిందూ ధర్మార్థ సమితి దాతలు అందించనున్నారు. దీనికి సంబంధించి చెన్నై నుండి ఈ ప్రత్యేక గొడుగులు అక్టోబరు 4వ తేది ఊరేగింపుగా ప్రారంభమై అక్టోబరు 9న తిరుమల చేరుకోనున్నాయి.
అయితే సదరు సంస్థకు చెందిన దాతలు స్వచ్ఛందంగా శ్రీవారికి కానుకగా సమర్పిస్తున్న గొడుగుల మాత్రమే కాని ఇందులో తి.తి.దే ప్రమేయం ఎంతమాత్రం లేదు. కనుక భక్తులు కూడా ఈ విషయాన్ని గమనించి చెన్నై నుండి తిరుమలకు గొడుగులు ఊరేగింపుగా చేరుకొనే క్రమంలో ఎటువంటి కానుకలు గాని, డబ్బులుగాని సదరు సంస్థకు సమర్పించరాదని తెలియజేయడమైనది. ఈ కానుకలు తి.తి.దే నిధులకుగాని, శ్రీవారి హుండీలోకాని జమచేయబడదని భక్తులకు తెలియజేయడమైనది.
ప్రత్యేకంగా చెన్నై పోలీసు యంత్రాంగం పై తెలిపిన విషయాలను గమనించి భక్తులు విరాళాలు మరియు కానుకలను ఊరేగింపు సమయంలో చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.