Procession of Sruya Prabha Vahanam _ సూర్యప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి అభయం

Processional deity of Lord Siva along with Goddess Parvathi were taken out in procession on Surya Prabha Vahanam as part of ongoing Annual brahmotsavam in Sri Kapileswara Swamy Temple in Tirupati on Monday morning.
 
DyEO Smt. Reddamma, VSO Sri Hanumanthu, Temple Staff and others took part in the procession

సూర్యప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి అభయం

తిరుపతి, మార్చి 4, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవ సాగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.

 

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, కపిలేశ్వరాలయ సూపరింటెండెంట్‌ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.