PROTECTION AND PROMOTION OF DESI COWS IS OUR PRIORITY-TTD EO _ భక్తుల భాగస్వామ్యంతో గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

KANUMA FESTIVAL OBSERVED WITH RELIGIOUS FERVOUR IN SV GOSHALA

 DEVOTEES THRONG IN LARGE NUMBERS

Tirupati, 16 Jan. 20: The protection and promotion of Indigenous breeds of cattle is one of the topmost priorities of TTD, said EO Sri Anil Kumar Singhal. 

The TTD Administrative Chief took part in the Gopuja Mahotsavam observed at SV Gosamrakshanasala in Tirupati on the occasion of the Kanuma festival on Thursday.

After performing Puja to Sri Venugopala Swamy and Gomata, the EO told media persons, there are about 3000 desi cattle including 1200 bulls and 1800 cows in SV Gosala of TTD. Apart from this, the State of Art of Gosala located at 450acres of a sprawling area in Palamaner has also housed many Desi breeds of cattle. “Our aim is to promote the Panchagavya products also by taking up awareness programmes to Dairy farmers in a big way soon”, he highlighted.

Earlier, the Chekka Bhajans, Kolatams by HDPP artists, Annamacharya Sankeertans by the project artists enthralled the devotees who thronged with children in large numbers to catch up the spectacular event wherein different animals including Horses, Elephants etc.apart from Cows were decked colourfully to match the occasion.

TTD Trust Board members Sri DP Ananta, Sri Sekhar Reddy, Dr M Nischita, Dairy Farm Director Dr. Harnath Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  



భక్తుల భాగస్వామ్యంతో గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 16: మన వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను భక్తుల భాగస్వామ్యంతో రక్షించుకోవడం ద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గురువారం కనుమ పండుగ  సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. 

ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశేషమైన స్థానం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గోవును ఆరాధించి, ఆశీర్వాదం అందుకోవాలని కోరారు. హిందూ ధర్మంలోని పూజావిధానాలను, నేడు మనకున్న వనరులను రాబోవు తరాలవారికి అందించాలని సూచించారు. పలమనేరు వద్ద 450 ఎకరాలలో ఇప్ప‌టికే రూ.45 కోట్ల‌తో అత్యాధునిక గోశాలను టిటిడి ఏర్పాటు చేసిన‌ట్లు తెలియజేశారు. శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు అవ‌స‌ర‌మైన పాలు, నెయ్యి త‌దిత‌ర అవ‌స‌రాల కొర‌కు తిరుప‌తిలో గో సంవ‌ర‌క్ష‌ణ శాల ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. తిరుపతిలోని గోశాలలో 3000 పశువులు ఉన్న‌య‌ని, ఇందులో 1800 ఆవులు, 1200 ఎద్దులు ఉన్నాయని తెలిపారు.  వీటిలో 14 ర‌కాల దేశావ‌లి జాతులైన‌ ఒంగోలు, పుంగనూరు, కపిలగోవు, హర్యానా, కంగాయమ్‌, ధియోని, హల్లికార్‌, ఉంబలాచారి, సాహిపాల్‌, రాతి గోవుపలు అరుదైన జాతుల గోవులు ఉన్నాయని వివరించారు. భ‌క్త‌ల సౌక‌ర్యార్తం తిరుప‌తిలోని ఎస్‌.వి.గోశాల‌తో పాటు, అలిపిరిలోని అష్ట గోప్ర‌ద‌క్ష‌ణ శాల‌ను త్వ‌ర‌లో ప్రారంభించి భ‌క్త‌లు అంద‌రు గోపూజ నిర్వ‌హించి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. 

దేశవాళీ గోవులు ఎంతో విశిష్టమైనవని, వీటి పాలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, గోమూత్రం, పేడ ద్వారా పంచగవ్య ఔషధాలు తయారు చేయవచ్చని తెలిపారు.  వీటిపై రైతుల‌కు అవ‌గాహ‌ణ క‌ల్పించేందుకు, గో ఆభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు.

ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త మండ‌లి స‌భ్యులు శ్రీ డి.పి.అనంత‌, డా.ఎం.నిచిత‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజలో పాల్గొన్నారు. అటుతర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు  చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన నాదస్వర కచేరి, అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. తిరుపతిలోని వివిధ స్కూల్‌లకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులు హరికథా పారాయణం చేయనున్నారు. 

అనంత‌రం గోశాల‌లో పాండిచ్చేరికి చెందిన శ్రీ‌మ‌తి మాలతి ముగ్గుల రంగోలితో రూపొందించిన శ్రీ వేణుగోపాల స్వామివారి పెయింటింగ్ భ‌క్త‌లను విశేషంగా ఆక‌ర్షించింది.

గోశాల సంచాలకులు డాక్టర్‌ కె.హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్, అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.