PROVIDE QUALITY SERVICES TO PILGRIMS-EO_ వసతి గదుల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, December 10, 2018: TTD Executive Officer Sri Anil Kumar Singhal instructed the Reception wing and Engineering Departments to upgrade the facilities in Srinivasan, Madhavam, Vishnu Nivasam rest houses besides Choultries No 2 and 3 at Tirupati.

Addressing a review meeting at TTD administrative building on Monday the EO said amenities in Choultties No 2 and 3 should be enhanced as they are close to the Railway station. Each room should have a portrait of Lord Venkateswara and Goddess Padmavati and security also should be enhanced. Lighting with tube lights be reinstalled and the dilapidated TTD employees quarters also should be renovated for allotment he to devotees.

The EO directed the installation of a display board on sale and availability of ₹300 tickets at Srinivasan complex. He instructed the officials concerned to Increase the number of lockers in dormitories of Srinivasan and Vishnu Nivasam and erect display boards on available rooms besides a public address system. He directed officials to prepare a vacancy report on all rest houses and choultries on daily basis.

Besides reviewing the functions of Security and IT departments, he also directed the civil, electrical and water works to complete pending works on war footing.

TTD Tirupati JEO Sri Pola Bhaskar, CVSO Sri Gopinath Jetty, FA and CAO Sri O Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, Srinivasam DyEO Sri Chengalarayulu, DyEO of Vishnu Nivasam Sri Hema Chandra Reddy, OSD of accommodation Sri Muniratnam Reddy participated in the review meeting.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వసతి గదుల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 డిసెంబరు 10: తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, 2, 3వ సత్రాల్లో గదులు పొందే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వసతి కల్పన విభాగం, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో సోమవారం తిరుపతి వసతి కల్పన విభాగంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 2, 3వ సత్రాలు రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండడంతో ఎక్కువమంది భక్తులు బస చేసేందుకు అనువుగా సౌకర్యాలు పెంచాలని సూచించారు. ప్రతి గదిలో స్వామి, అమ్మవార్ల చిత్రపటం ఉంచాలన్నారు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ప్రతిగదినీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చోట్ల ట్యూబ్‌లైట్లు, బల్బులు మార్చాలని ఇతర లోటుపాట్లను సవరించాలని ఆదేశించారు. సత్రాల వద్ద శిథిలావస్థలో ఉన్న టిటిడి క్వార్టర్స్‌ స్థానంలో భక్తులకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్‌లో రూ.300/- టికెట్ల లభ్యత సమాచారాన్ని భక్తులు తెలుసుకునేందుకు వీలుగా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

శ్రీనివాసం, విష్ణునివాసం, సత్రాలలో డార్మిటరీలలో లాకర్ల సంఖ్యను పెంచాలని, గదుల లభ్యతకు సంబంధించి డిస్‌ప్లే బోర్డులు, యాత్రికులకు సమాచారాన్ని తెలిపేందుకు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. గదుల బుకింక్‌ కౌంటర్ల పనివేళలను ప్రదర్శించాలన్నారు. ఆయా వసతి సముదాయాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను భక్తులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు సంబంధిత విభాగాల అధికారులు నివేదికను రూపొందించా లన్నారు. సెక్యూరిటీ, ఐటీ విభాగాల సేవలపై సమీక్షించారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, వాటర్‌ వర్క్స్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎఫ్‌ఏసిఎవో శ్రీ ఓ బాలాజీ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ సి.చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసం డిప్యూటీ ఈవో శ్రీచెంగల్రాయులు, విష్ణునివాసం డిప్యూటీ ఈవో శ్రీ హేమచంద్రారెడ్డి, వసతి కల్పన విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.