PUJAS OFFERED TO AKKAIYAGARLU_ మొదటి ఘాట్ రోడ్డులో ఘనంగా అక్కదేవతల కార్తీకమాస పూజ
Tirumala, 1 December 2017: Special Karthika Masa pujas were offered to the seven folk goddess in the Akkayyagarlu Gudi located in the First Ghat Road on Friday under the aegis of Transport wing of TTD.
The Akkayyagalu are considered to be most powerful by the pedestrian as well the drivers since they are believed to guard the ghat roads and ensure accident free safe journey to pilgrims.
Tirumala JEO Sri KS Sreenivasa Raju, GM Transport Sri Sesha Reddy, DI Sri Bhaskar Naidu also offered prayers in the temple.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మొదటి ఘాట్ రోడ్డులో ఘనంగా అక్కదేవతల కార్తీకమాస పూజ
డిసెంబరు 01, తిరుమల 2017: టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడుగురు అక్కదేవతలకు శుక్రవారం కార్తీకమాస పూజ ఘనంగా జరిగింది. అక్కదేవతల సన్నిధిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఘాట్ రోడ్డులో వాహనాల్లో ప్రయాణించే భక్తులు సురక్షితంగా గమ్యస్థానం చేరాలని ప్రార్థిస్తూ అక్క దేవతలకు పూజలు చేసినట్టు తెలిపారు.
టిటిడి ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, విఎస్‌వో శ్రీమతి సదాలక్ష్మి, డిఐ శ్రీభాస్కర్‌నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.