MANAGUDI OFF TO A CEREMONIAL START IN TWO TELUGU STATES_ రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమైన ‘మనగుడి’

Tirupati, 1 December 2017: The mass temple programme, Managudi commenced on a grand religious note in two Telugu states in around 300 temples on Friday.

On December 2 there will be Nagara Sankeerthana, Krithika Deepotsavam while on December 3 following Gurupuja will be observed following Datta Jayanti.

KRITTIKA DEEPOTSAVAM IN SRI KT

In the advent of Krithika Nakshatram on December, Krithika Deepotsavam will be observed in the famous Shiva temple at Sri Kapilateertham in Tirupati on December 2.

The Deepotsavam will be celebrated between 6pm and 6:30pm in the temple.

TTD TAKES OVER SHIVA TEMPLE

The temple management has taken over yet another age old Lord Shiva temple in Seshapuram at Chandragiri Mandalam on Friday.

Speaking on this occasion, Tirupati JEO Sri P Bhaskar said, under the instructions of Honourable CM of AP Sri N Chandra Babu Naidu and TTD EO Sri Anil Kumar Singhal, TTD has taken over Sri Seshachala Lingeswara Swamy temple in Chandragiri as a part of its mission of reviving ancient temples.

“The civil and electrical works to develop this temple will be taken up very soon”, he added.

DLO Sri Venkaramana Naidu, Sp.Gr.Dy.E.O.Sri Munirathnam Reddy, SE Electrical Sri Venkateswarulu, DyEO General Smt Gowtami were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమైన ‘మనగుడి’

తిరుపతి, 2017 డిసెంబరు 01: హైందవ సనాతన ధర్మానికి ప్రతీకలుగా అలరారుతున్న దేవాలయాల వైశిష్ట్యాన్ని నేటి తరానికి అందించడమే ధ్యేయంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మనగుడి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

డిసెంబరు 1 నుండి 3వ తేదీ వరకు 11వ విడత మనగుడి కార్యక్రమాన్ని రెండు తెలుగురాష్ట్రాలలో ఎంపిక చేయబడిన 294 ఆలయాలలో నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆయా గ్రామాల ప్రజలు ఆలయాలను శుభ్రపరచి, రంగులు వేశారు. డిసెంబరు 2న నగర సంకీర్తన, కృత్తిక దీపోత్సవం, డిసెంబరు 3న దత్తజయంతి సందర్భంగా గురుపూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు గోవిందరక్ష కంకణాలు, ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయాన్ని పరిశీలించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని పురాతనమైన శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయాన్ని త్వరలో టిటిడిలోకి విలీనం చేసుకోనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు మరియు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ధర్మప్రచారంలో భాగంగా పురాతన ఆలయాలను పునరుద్ధరించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగానే ఆలయ అభివృద్ధికి రోడ్లు, ఇంజినీరింగ్‌, ఇతర మౌలిక వసతులను పరిశీలించినట్లు తెలిపారు. టిటిడి ప్రమాణాల మేరకు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా వసతులు కల్పిస్తామని జెఈవో తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిఎల్‌వో శ్రీ వెంకటరమణ నాయుడు, ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, ఎస్టేట్‌ అధికారి శ్రీమతి గౌతమి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.