PURUSAIVARI TOTOTSAVAM OBSERVED_ ఘ‌నంగా శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

Tirumala 3,August 2019: The festival of Sri Andal Thiruvadipuram Sattumora was grandly performed at Srivari temple on Saturday which is also known as Purusaivari Tototsavam.

Legends say that on the Purva Phalguni star on Ashada Shukla Chaturthi day is usually considered as birthday of Sri Andal(Godadevi). On this occasion, Thiruvadipuram Sattumora festival was conducted with religious fervour on Saturday.

The procession of Sri Malayappaswamy and his consorts visit Purusaivari thota and after that Harati , puja were rendered to Pogada tree. Later the deities retuned to temple.

Temple pesikar Sri Lokanadham and temple staff were present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘ‌నంగా శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

తిరుమల, 2019 ఆగస్టు 03: తిరుమలలో శనివారం శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర ఘనంగా జరిగింది.

సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. శేషహారతి, పుష్పసరము, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడినుంచి స్వామి, అమ్మవార్లు తిరిగి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.