PUSHKARINI TO OPEN FOR PILGRIMS FROM SEPT 1 _ శ్రీవారి భక్తులకు ఆదివారం నుండి అందుబాటులోకి రానున్న స్వామి పుష్కరిణి

TIRUMALA, 31 AUGUST 2024: After undergoing repairs, cleaning and restoration works, the entry of the pilgrims into the temple tank Swamy Pushkarini will resume from September 1 onwards.

It may be mentioned here that as a practice,  the temple tank is usually cleansed and repairs works if any are being carried out every year before annual brahmotsavams at Tirumala. The entire cleaning and renovation activity takes place for a month during which the pilgrims will not be allowed to take bath in the Pushkarini. After a month the sacred Pushkarini Bath resumes for pilgrims from September 1 onwards.

The devotees are requested to make note of this.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి భక్తులకు ఆదివారం నుండి అందుబాటులోకి రానున్న స్వామి పుష్కరిణి

తిరుమల, 2024 ఆగష్టు 31: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణిలోనికి ఆదివారం నుండి శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతించనుంది.

కాగా ఈ మరమత్తు పనులు టీటీడీ ఆగష్టు 1వ తేదిన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్‌ విబాగంవారు దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు (పెయింటింగ్‌) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమత్తు పనులు పూర్తిచేశారు.

అయితే గత నెల స్వామి పుష్కరిణి మరమత్తుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒక నెల రోజులపాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. సెప్టంబర్‌ 1వ తేది నుండి భక్తులను కూడా పుష్కరిణిలోనికి అనుమతించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.