PUSHPAYAGA MAHOTSAVAM -A CYNOSURE TO DEVOTEES _ శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

FRAGRANCE OF FLOWERS SPREADS AT TIRUCHANOOR

 FOUR TONNES OF FLOWERS USED

Tiruchanoor, 2 Dec. 19: It was  a colourful evening spread with the fine fragrance of tonnes of aromatic flowers on the occasion of Pushpayaga Mahotsavam at Tiruchanoor on Monday evening. 

SIGNIFICANCE:

TTD organised Pushpa Yagam event at the Sri Padmavathi Ammavari Temple after the successful completion of the nine day festival of annual Karthika Brahmotsavams.

Explaining the importance of Pushpayagam,  Pancharatra Agama adviaor Sri Srinivasacharyulu said, the purpose of the divine event was to ward off any ill impact of any lapses, if any , which occurred in the temple , by devotees or temple staff and archakas during the Brahmotsavams. Hence it is also called “Pariharotsavam”.

FLOWERS AND LEAVES SHOWERED 

The divine beauty of Goddess Padmavathi enhanced on the bed of four tonnes of 14 varieties of flowers and six varieties of leaves.

To commence with, the sacred Tulasi leaves were offered to Goddess followed by Ixora,  lillies, Chrysanthemum,  Ganneru, roses, lotuses, Kanakambaram, an amalgamation of Bilva and Panneer leaves, Manoranjitam and Mogali were rendered in a colourful manner amidst chanting of Chaturveda Parayana by vedic scholars.

The devotees were spell bound by the beauty of Goddess on the bed of flowers.

TTD EO Sri Anil Kumar Singhal,  Board member Sri DP Ananta, DyEO Sri C Govindarajan,  Garden Deputy Director Sri Srinivasulu and others participated.

SNAPANAM PERFORMED 

Earlier during the day Snapana Tirumannam was performed to the deity in Sri Krishna Mukha Mandapam. 

PROCESSION OF FLOWERS

The flowers were brought in a colourful procession from Asthana Mandapam to Krishna Mukha Mandapam in the afternoon. Nearly 100 sevaks took part in the fete.  Garden Deputy Director Sri Srinivasulu,  Superintendent Sri Gopalakrishna Reddy and others were present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుపతి, 2019 డిసెంబరు 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి సోమ‌వారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది.

వేడుకగా స్నపన తిరుమంజనం :

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

పుష్ప‌యాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

వైభవంగా పుష్పాల ఊరేగింపు :

తొలుత మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.

అనంతరం సాయంత్రం 5.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీ కృష్ణముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ డి.పి.అనంత్‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజన్‌, గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, గార్డెన్‌ మేనేజర్‌ శ్రీ జనార్ధన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.