PUSHPAYAGAM IN SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శోభాయమానంగా పుష్పయాగం
Tirupati, 30 June 2017: The temple of Sri Govindaraja Swamy observed Pushpayagam fete in a ceremonial way on Friday evening.
As per the scriptures, this festival is usually performed to save the earth from natural calamities such as quakes, cyclones, epidemics and appease the Lord to save the life of humanity, flora and fauna from all the catastrophes.
Tonnes of various varieties of flowers were used to give celestial bath to the utsavarulu on the specially decked plat form. This ritual took place between 1pm and 4pm.
Temple DyEO Smt Varalakshmi and other office staffs were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శోభాయమానంగా పుష్పయాగం
తిరుపతి, 2017 జూన్ 30: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో మే 31 నుంచి జూన్ 8వ తేదీ వరకు బ్రహ్మూెత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మూెత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివ త్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 1.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నులతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు విరాళంగా అందించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ముందుగా శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి పుష్పాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. కాగా సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.