LIST OF EVENTS IN THE MONTH OF JULY IN SRI GT_ జూలైలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 30 June 2017: There are series of religious event which are to take place in the month of July in the famous ancient temple of Lord Sri Govinda Raja Swamy, which happens to be one of the most important sub-shrines under the umbrella of TTD in Tirupati.
>With the advent of Swathi Nakshatram on July 3 Periyalwar Sattumorai will be observed.

> Jyestabhishekam from July 4-6
> During the Fridays which falls on 7,14 and 21 there will be procession of Sri Andal Ammavaru along the four mada streets.
> Pournami Garuda Vahanam on July 9
> As it happens to be Shravana-the birth star of Lord, the processional deities will take celestial ride along the four mada steets by 5.30pm on July 11.
> Anivara Asthanam on July 16
> Tiruvadippudi utsavam of Andal from July 17 to 25
> Annan Sattumorai on July 23
> Andal Tiruvadippodi Sattumorai on July 26
> With the asterism of Uttara falling July 28, Lord Govinda Raja Swamy accompanied by his two consorts Sridevi and Bhudevi will bless the devotees along the four mada streets by 5.30pm.
> Processional of deities to Ahobila Mutt on the advent of Swathi Star on July 31

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలైలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2017 జూన్‌ 30: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 3న స్వాతి నక్షత్రం, శ్రీ పెరియాళ్వార్‌ సాత్‌మొరై సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్‌ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

– జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.

– జూలై 7, 14, 21వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

– జూలై 9న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరుగనుంది.

– జూలై 11న శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

– జూలై 16న ఆణివార ఆస్థానం సందర్భంగా రాత్రి 7.00 గంటలకు బంగారు వాకిలి వద్ద శ్రీవారికి ఆస్థానం నిర్వహిస్తారు.

– జూలై 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ ఆండాల్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం నిర్వహించనున్నారు.

– జూలై 23వ తేదీ అన్నన్‌ సాత్‌మొరై సందర్భంగా ఉదయం 8.00 గంటలకు ఉభయనాంచరులతో శ్రీవరదరాజస్వామివారు, ప్రతివాధి భయంకర అన్నన్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం 4.00 గంటలకు చక్రతాళ్వార్‌ సాత్‌మొరైను పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

– జూలై 26న ఆండాళ్‌ తిరువడిపురం సాత్‌మొరై సందర్భంగా సాయంత్రం 4.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా అలిపిరి శ్రీవారి పాదాలమండపం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంది.

– జూలై 28న ఉత్తరా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.

– జూలై 31న స్వాతి నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారు అహోబిలం మఠానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.