RATHA SAPTHAMI AT TIRUMALA ON FEBRUARY 19- TTD EO_ ఫిబ్ర‌వ‌రి 19న తిరుమ‌ల‌లో రథసప్తమి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

VAHANA SEVAS IN MADA STREETS

 CHAKRASNANAM IN EKANTAM

 ONLY DEVOTEES WITH TICKETS AND TOKENS ARE ALLOWED 

 Tirupati, 18 Jan. 21: TTD will organise Saptha Vahana Seva on the day of Surya Jayanthi on February 19, with the procession of different vahanams along four Mada streets, said TTD Executive Officer, Dr KS Jawahar Reddy.

During a review meeting on preparations for Ratha Sapthami celebrations held at the Conference Hall in TTD Administrative Building on Monday evening along with Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, District Collector Sri Bharat Narayana Gupta, the EO said that only devotees with tickets and tokens will be allowed in the galleries of Mada Streets to witness the Vahana sevas. The holy event of Chakrasnanam however will be observed in Ekantham, he observed.

The TTD EO directed Additional EO to review over the department-wise arrangements with all HoDs and instructed CVSO to coordinate with the district Police to make foolproof arrangements of security and facilities for devotees at Mada street galleries during the big day. 

Later at Annamaiah Bhavan in Tirumala, the Additional EO along with CVSO reviewed with all the departments including Temple, Vigilance, Annaprasadam, Health, Kalyanakatta, Medical and other wings over the necessary arrangements to be made for the devotees.

CE Sri Ramesh Reddy, Additional CVSO Sri Siva Kumar Reddy, ASP Sri Muniramaiah, all HoDs of Tirumala were also present in both the meetings.

Following are details of Vahana sevas on Ratha Sapthami which is scheduled on February 19 

Surya Prabha vahana – 5.30-8am (Suryodayam 6:38am)

Chinna Sesha vahana  – 9am-10am

Garuda vahana           – 11am-12noon 

Hanumanta vahana     –  1pm-2pm 

Chakra Snanam           –  2pm-3pm

Kalpavruksha vahana  –  4pm-5pm

Sarvabhoopala vahana –  6pm-7pm

Chandra Prabha vahana- 8pm-9pm

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 19న తిరుమ‌ల‌లో రథసప్తమి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు

ద‌ర్శ‌న టోకెన్లు గ‌ల భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తి

ఏకాంతంగా చ‌క్ర‌స్నానం
 
తిరుమ‌ల‌, 18 జనవరి 2021: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం నిర్వ‌హిస్తామని, ఇందుకోసం ద‌ర్శ‌న టోకెన్లు గ‌ల భక్తుల‌ను మాత్ర‌మే తిరుమ‌లకు అనుమ‌తిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో సోమ‌వారం సాయంత్రం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ నారాయ‌ణ భ‌ర‌త్ గుప్తా, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ఈవో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం ఏర్పాట్ల‌పై ప్రాథ‌మిక స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం నాడు శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఏడు ప్ర‌ధాన వాహ‌నాల‌పై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని, సూర్య‌ప్ర‌భ వాహ‌నంతో మొద‌లై రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నంతో వాహ‌న‌సేవ‌లు ముగుస్తాయ‌ని తెలిపారు. చ‌క్ర‌స్నానం ఏకాంతంగా జ‌రుగుతుంద‌న్నారు. అనంత‌రం భ‌క్తుల‌ను ఏవిధంగా గ్యాల‌రీల్లోకి అనుమ‌తించాలి, భ‌ద్ర‌తప‌రంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై అధికారుల‌తో చ‌ర్చించారు. జిల్లా యంత్రాంగం స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని, అన్ని విభాగాల అధిప‌తులు ఈ ప‌ర్వ‌దినానికి స‌మాయ‌త్తం కావాల‌ని సూచించారు.

అనంత‌రం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ర‌థ‌స‌ప్త‌మి ఏర్పాట్ల‌పై వివిధ విభాగాధిప‌తుల‌తో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. విభాగాల వారీగా స‌మీక్షించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.
 
ఈ స‌మావేశాల్లో ఏఎస్పీ శ్రీ మునిరామ‌య్య‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ అన్ని విభాగాల అధిప‌తులు పాల్గొన్నారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం       ఉదయం      5.30 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.38 గంట‌ల‌కు)

చిన్నశేష వాహనం          ఉదయం         9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం              ఉదయం         11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం     మధ్యాహ్నం   1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం                   మధ్యాహ్నం     2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు

కల్పవృక్ష వాహనం         సాయంత్రం   4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం    సాయంత్రం   6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం        రాత్రి                 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.