CHAIRMAN DONATES COW TO KSHEERARAMAM TEMPLE _ పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత

Tirumala, 18 Jan. 21: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Monday donated a Cow and calf to the famous Ksheeraramam temple in West Godavari.

Speaking on the occasion he said as part of Hindu Sanatana Dharma, TTD has taken up unique programme called Gudiko Gomata by presenting a cow and calf to every temple as a part of the mission. 

He also said, TTD is also constructing 500 temples in SC, ST and BC colonies.

Ministers of AP, Smt T Vanita, Sri Venugopala Krishna, Sri Ranganadha Raju, local public representatives, temple authorities were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత
–  గోమాత, దూడ అందించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
 
తిరుపతి 18 జనవరి 2021: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి గుడికో గోమాత ద్వారా టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం గోమాత, దూడను అందించారు.
 
ఈ సందర్భంగా చైర్మన్ గో పూజలో పాల్గొన్నారు. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా టీటీడీ దేశ వ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. టీటీడీని సంప్రదించే ఆలయాలకు టీటీడీ గోవును ఇస్తుందనీ, దాని సంరక్షణ భాద్యత ఆలయాలే చూసుకోవాలని చెప్పారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో  బిసి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 500 ఆలయాలు నిర్మించనున్నామని చెప్పారు.
 
ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ  సుబ్బారెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభం  స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సుబ్బారెడ్డి క్షీరా రామస్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఆయనకు తీర్థ, ప్రసాదాలు అందించారు.
        
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ శ్రీరంగనాధరాజు, బిసి సంక్షేమ శాఖ మంత్రి  శ్రీ వేణు గోపాల కృష్ణ తో పాటు పలువురు శాసన సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.