RECEPTION WING ACTIVITIES REVIEWED _ భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి కల్పించాలి : టీటీడీ ఈవో జె. శ్యామలరావు
INSTRUCTS IT WING FOR PILGRIM-FRIENDLY MEASURES IN RECEPTION
TIRUMALA, 25 JUNE 2024: As a part of the departmental review, TTD EO Sri J Shyamala Rao reviewed the activities of the Reception wing on Tuesday evening.
The review meeting was held in the conference hall of Gokulam Rest House along with JEOs Smt Gautami, Sri Veerabrahmam, Reception and IT wing officials.
In the PowerPoint presentation, the Reception officials briefed EO about number of rooms available in Tirumala and maximum number of pilgrims that could be accommodated.
The EO also reviewed on CD Refund, Facial Recognition mechanisms besides identifying middle men and the ways to control their menace, accommodation available in Tirupati, new PACs in offing, and other related issues in detail.
He said maximum pilgrims should get the accommodation by minimising the middle men menace and instructed IT wing to come out with pilgrim-friendly measures in the Reception wing.
Later he directed the officials concerned to give him the lists about details of persons who are repeatedly availing accommodation, improper vacation of rooms and other issues.
Reception wing DyEOs Sri Harindranath, Sri Bhaskar, GM IT Sri Sandeep Reddy, GM Transport Sri Sesha Reddy, OSD Sri Satre Naik, AEO Computers Sri Venkateswarlu Naidu and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి కల్పించాలి : టీటీడీ ఈవో జె. శ్యామలరావు
తిరుమల, 2024 జూన్ 25: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి కల్పించాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో మంగళవారం సాయంత్రం గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, రిసెప్షన్, ఐటీ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వసతి విభాగం అధికారులు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయి, ఎంత మంది యాత్రికులకు వసతి కల్పించవచ్చు అనే అంశాలపై ఈవోకు వివరించారు.
సీడీ రీఫండ్, దళారులను గుర్తించడంతో పాటు వారిని నియంత్రించే మార్గాలు, తిరుపతిలో అందుబాటులో ఉన్న వసతి, కొత్తగా నిర్మాణంలో ఉన్న పిఏసిలు, ఇతర సంబంధిత అంశాలపై ఈవో సమీక్షించారు.
అనంతరం పదే పదే వసతి పొందుతున్న వారి వివరాలు, గదులు సక్రమంగా ఖాళీ చేయకపోవడం, ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో వసతి విభాగం డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ భాస్కర్, ట్రాన్స్‌పోర్ట్ (జిఎం) శ్రీ శేషారెడ్డి, ఐటీ జిఎం శ్రీ సందీప్ రెడ్డి, ఓఎస్డి శ్రీ సత్రే నాయక్, ఏఈఓ (కంప్యూటర్స్) శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.