CHAKRASNANAM PERFORMED _ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

Tirupati, 25 June 2024: The annual Brahmotsavam in Appalayagunta has reached the last day on Tuesday.

Snapana Tirumanjanam to the utsava deities along with Sri Sudarshana Chakrattalwar was observed amidst chanting of Vedic hymns.

Later the celestial disc was given holy dip in the sacred waters of the temple tank.

DyEO Sri Govindarajan, AEO Sri Ranesh, Superintendent Smt Srivani, Temple inspector Sri Siva Kumar, Kankanabhattar Sri Suryanaraya Nacharyulu, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

తిరుపతి, 2024 జూన్ 25: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం 9.15 నుండి 10.45 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.