టిటిడి పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
టిటిడి పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2019 జనవరి 25: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో జనవరి 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిపాలనా భవనం వెనక వైపుగల మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం ఉదయం 7.45 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేగాక చక్కగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులను అందజేయనున్నారు. ఈ సందర్భంగా టిటిడి విద్యాసంస్థల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.