ALL SET FOR MAHA KUMBHABHISHEKAM IN KANYAKUMARI ON JANUARY 27_ జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం

Tirupati, 25 Jan 2019: All the arrangements are in place for the grand opening of Sri Venkateswara Swamy temple at Kanyakumari in Tamilnadu on January 27 with the ceremonial Maha Kumbhabhishekam in the auspicious Kumbha Lagnam at 7.30am.

Situation in the spacious Vivekanandapuri pilgrim centre, Tirumala Tirupati Devasthanams has constructed the temple of Sri Venkateswara Swamy in the serene premises at a cost of Rs.22.50crores.

A series of religious activities commenced from January 23 on wards and will conclude with Maha Kumbhabhishekam on January 27. On the final day, the day commences with Suprabhatam followed by Kumbharadhana, Nivedana, Homam, Maha Purnahuti between 4am and 7am while the Kumbhams(holy pots) and Utsava Murthies (processional deities) will be taken out on a celestial procession and will be seated in their respective places in the Sannidhi. The Maha Kumbhabhishekam ceremony will take place between 7.30am and 9am.

After this religious ceremony, Brahmaghosha, Veda Sattumora, Dhwajarohanam, Archaka Bahumanam are observed between 9am and 10.30am while the Nitya Kainkaryams takes place between 10.30am and 12.30pm followed by Sarva Darshanam to pilgrims till 6.30pm.

In the evening, the divine wedding ceremony, Srinivasa Kalyanam takes place between 4pm and 5.30pm. Procession of deities and Dhwajavarohanam will be observed between 5.30pm and 6.30pm followed by Nitya Kainkaryams in the next one hour and then the devotees are again allowed for Sarva Darshan between 7.30pm and 8.30pm while the closure of the temple for the day is marked by the conduct of Ekanta Seva at 8.45pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం

జనవరి 25, తిరుపతి 2019: తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కన్యాకుమారిలోని వివేకానందపురంలో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 27వ తేదీ ఆదివారం ఉదయం 7.30 నుండి 9 గంటల నడుమ కుంభ లగ్నంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరుగనుంది. జనవరి 23 నుండి ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

జనవరి 27వ తేదీన ఉదయం 4 నుండి 7 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 7 నుండి 7.30 గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి వేంచేపు చేస్తారు. ఉదయం 7.30 నుండి 9 గంటల నడుమ కుంభ లగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు.

ఆ తరువాత ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిత్యకైంకర్యాల అనంతరం సాయంత్రం 6.30 గంటల వరకు సర్వదర్శనం, సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.