CHAIRMAN INSPECTS LADDU TOKEN COUNTERS_ తిరుమలలో ల‌డ్డూ టోకెన్ల జారీ కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్

Tirumala, 25 Jan 19: TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav on Friday inspected Laddu token issuing counters at Sarva Darshanam complex in Tirumala.

Later speaking to media persons he said, following the malpractices which was reported a few days ago, action has been taken against a Trilok employee and was suspended for collection more amount for issuing laddu tokens.

He said, to enhance transparency and to provide best possible services to pilgrims, “TTD will not spare those who are found guilty. I have also instructed the supervisor that such incidents should not be repeated in future”, he added.

Further he said, “After the incident all the counters are now operating in a perfect manner without any misappropriation”, the chairman said.

Earlier he inspected all the counters and verified the tokens issued and amount collected in the laddu token issuing counters.

AVSO Sri Gangaraju was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలో ల‌డ్డూ టోకెన్ల జారీ కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్

జ‌న‌వ‌రి 25, తిరుమల 2019: తిరుమలలో ల‌డ్డూ టోకెన్ల జారీ కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ శుక్రవారం ఉద‌యం తిరుమలలోని స‌ర్వ‌ద‌ర్శ‌నం కాంప్లెక్స్‌లోని ల‌డ్డూ టోకెన్ల జారీ కేంద్ర‌ల‌ను తనిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవ‌ల ల‌డ్డూ టోకెన్ల‌ను ఆక్ర‌మంగా విక్ర‌యిస్తు ప‌ట్టుబ‌డిన త్రిలోక్ సంస్థ‌కు చెందిన ఉద్యోగిని విధుల నుండి తొల‌గించి, అత‌ని వ‌ద్ద అధిక మొత్తంలో న‌గ‌దును స్వాదినం చేసుకున్న‌ట్లు తెలిపారు.శ్రీ‌వారి భ‌క్తులకు మ‌రింత మెరుగైన, పార‌ద‌ర్శ‌కంగా సేవ‌లందించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. అందులో భాగంగా భ‌విష్య‌త్తులో ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండ ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిటిడి అధికారుల‌ను, త్రిలోక్ సంస్థ ప్ర‌తినిధులను ఆదేశించారు.

అంత‌కుముందు ఛైర్మ‌న్‌, అధికారుల‌తో క‌లిసి స‌ర్వ‌ద‌ర్శ‌నం కాంప్లెక్స్‌లోని అన్ని ల‌డ్డూ టోకెన్ల జారీ కేంద్రాల‌లో భ‌క్తుల‌కు ఇచ్చిన టోకెన్లు, న‌గ‌దును ప‌రిశీలించారు.

టిటిడి ఛైర్మన్‌ వెంట ఎవిఎస్‌వో శ్రీ గంగ‌రాజు తదితరులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.