RESOLVE ACCOMMODATION ISSUES WITHOUT DELAY-TTD EO _ రిసెప్షన్(ఎఫ్ఎంఎస్) ఫిర్యాదుల‌ను స‌త్వరం ప‌రిష్క‌రించండి : ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు … టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

SMART CARDS TO EMPLOYEES

TIRUPATI, 06 SEPTEMBER 2021: The complaints and issues pertaining to the reception wing raised by pilgrims, should be attended and resolved without any delay, directed TTD EO Dr KS Jawahar Reddy.

The Senior Officers’ meeting was held at the Conference Hall in the TTD Administrative Building on Monday. The EO reviewed various issues related to different departments with the respective Heads. While reviewing the Reception department, he instructed the officials concerned to resolve the complaints registered on the toll-free number 9966812345 without any delay.

 

The EO also reviewed the ongoing development works related to SV Museum in Tirumala and also in Tirupati which is located adjacent to Sri Govindaraja Swamy temple. 

Reviewing the Health prospect of employees, the EO said the Health Profile of each employee should be recorded by the Medical Wing of TTD. He also said the details of employees and retired employees along with their dependents should be collected to issue Smart Cards to all of them. “This process should complete within a week”, he instructed. He reviewed the ongoing vaccination process to employees aged between 18years to 45years.

The EO instructed the Engineering Wing officials to lay a bio-fencing at Palamaner Gosala and also dig trenches at necessary places. 

The other important areas of review included, involving Srivari Sevakulu in all the TTD religious programmes conducted in coordination with all Projects of TTD, bringing out Sapthagiri Magazine edition in a more attractive manner from October onwards, mode of darshan procedures underway in local temples, supplying of Radium jackets to sanitary staffs working at Tirumala and Tirupati etc.

Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao and other Heads were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రిసెప్షన్(ఎఫ్ఎంఎస్) ఫిర్యాదుల‌ను స‌త్వరం ప‌రిష్క‌రించండి :  ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు
 
టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి
 
తిరుమ‌ల‌, 2021 సెప్టెంబ‌ర్ 06: తిరుమ‌ల‌లో బ‌స‌కు సంబంధించిన రిసెప్షన్(ఎఫ్ఎంఎస్) టోల్ ఫ్రీ నంబ‌రు : 9966812345కు వ‌స్తున్న సూచ‌న‌లు, స‌ల‌హాలు, ఫిర్యాదుల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గ‌దులు పొందే యాత్రికులు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లేలా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌న్నారు. టెక్ మహింద్రా, టాటా సంస్థ‌ల స‌హ‌కారంతో ఆధునీక‌రించనున్న తిరుమ‌లలోని ఎస్వీ మ్యూజియం ప‌నుల‌ను ఈవో స‌మీక్షించారు. అదేవిధంగా తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద‌గ‌ల మ్యూజియం అభివృద్ధిపై చ‌ర్చించారు. టిటిడి ఉద్యోగుల‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, పూర్తి ఆరోగ్య‌వంతులుగా ఉన్న‌ప్పుడే చ‌క్క‌గా విధులు నిర్వ‌హించి భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించ‌గ‌లుగుతార‌ని తెలిపారు. ఉద్యోగుల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాల‌ని, ఇందుకోసం వైద్య విభాగం ప్ర‌త్యేకంగా కార్యాచర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. ఉద్యోగులు, కుటుంబ స‌భ్యులు, పెన్ష‌న‌ర్ల స్మార్ట్ కార్డుల త‌యారీకి సంబంధించి వారం రోజుల్లోపు అంద‌రి నుంచి వివ‌రాలు తెప్పించుకోవాల‌న్నారు. ఉద్యోగులు రిటైరైన రోజే అన్ని ప్రయోజనాలు అందించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమ‌ల శేషాచ‌లం అడ‌వుల్లో విస్త‌రించి ఉన్న అకేషియా చెట్ల‌ను తొల‌గించి ఇత‌ర మొక్క‌లు నాటే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు.
 
45 సంవ‌త్స‌రాలు దాటిన ఉద్యోగుల్లో వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని, ఇక 18 నుండి 45 ఏళ్ల లోపు ఉన్న ఉద్యోగుల‌కు వ్యాక్సిన్లు వేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ప‌ల‌మనేరులోని ఎస్వీ గోశాల చుట్టూ బ‌యోఫెన్సింగ్ ఏర్పాటు చేయాల‌ని, అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో కంద‌కాలు తవ్వేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అక్టోబ‌రు నుంచి స‌ప్త‌గిరి మాస‌ప్ర‌తిక‌ను స‌రికొత్త శీర్షిక‌ల‌తో ఆక‌ర్ష‌ణీయంగా తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. టిటిడిలోని వివిధ ప్రాజెక్టుల స‌మ‌న్వ‌య స‌హ‌కారంతో నిర్వ‌హించ‌నున్న ప‌లు ఆధ్యాత్మిక‌, భ‌క్తి కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌వారి సేవ‌కుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని సూచించారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి రేడియం జాకెట్లు అందించాల‌న్నారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ముఖ‌ద్వారం, ఇత‌ర ప‌రిస‌రాలను ఆధ్యాత్మిక‌త ఉట్టిప‌డేలా రూపొందించాల‌ని సూచించారు. అనంత‌రం స్థానికాల‌యాల్లో అమ‌ల‌వుతున్న ద‌ర్శ‌న విధానాలు, సేవ‌ల గురించి స‌మీక్షించారు.
 
ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.