ADDITIONAL EO INSPECTS DRY AND WET WASTE COLLECTION CENTRES _ తిరుమ‌ల‌లో ఘ‌న, ద్ర‌వ వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ కేంద్రాలను త‌నిఖీ చేసిన అద‌న‌పు ఈవో

Tirumala, 06 September 2021: TTD Additional EO Sri AV Dharma Reddy on Monday evening inspected the dry and wet garbage collection centres and made valuable suggestions.

 

As part of his inspection, he visited the liquid waste management plants at Srivari Mettu, Kalyana Vedika, Paachi Kaluva, Balaji Nagar and Annamaiah Bhavan.

 

He instructed officials to repair the unused electrical motor lying near the waste management plant and also to clear the electrical waste objects lying around.

 

Among others he directed officials to recycle the drain waters to gardens, clear garbage lying around, plant greenery and also suggested for qualitative recycling of drain waters.

 

Thereafter he visited the solid waste management plant at Kakulakonda and inspected the plant making manure from solid wastes.

 

He directed officials on clean maintenance of dumping yards and also the faster dispatch of packed non-decomposed wastes to Tirupati.

 

DFO Sri Chandrasekhar, DE Sri Ravishankar Reddy, EE Sri Srihari, Health Officer Dr Sridevi, Garden Deputy Director Sri Srinivasulu and others were present. 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో ఘ‌న, ద్ర‌వ వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ కేంద్రాలను త‌నిఖీ చేసిన అద‌న‌పు ఈవో

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 06: తిరుమ‌ల‌లో ఘ‌న, ద్ర‌వ వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ కేంద్రాలను అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం సాయంత్రం అధికారుల‌తో క‌లిసి త‌నిఖీ చేశారు.

ఇందులో భాగంగా తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద‌, క‌ల్యాణ‌ వేదిక స‌మీపం, ప‌చ్చికాల్వ వ‌ద్ద‌, బాలాజిన‌గ‌ర్ వ‌ద్ద‌, అన్న‌మ‌య్య భ‌వ‌నం స‌మీపంలోని ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ( లిక్విడ్‌ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్ల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ కేంద్రాల వ‌ద్ద నిరుప‌యోగంగా ఉన్న ఎల‌క్రిక‌ల్ మోట‌ర్ల‌ను రిపేరు చేసి వినియోగంలోనికి తీసుకురావాల‌ని, వ్య‌ర్థంగా ఉన్న ఎల‌క్రిక్ వ‌స్తువుల‌ను తొల‌గించాల‌ని ఆదేశించారు. మురుగు నీటిని శుభ్ర‌ప‌రిచి ఉద్యాన‌వ‌నాల‌కు ఉప‌యోగించుకోవాల‌ని, ప్లాంట్‌ల వ‌ద్ద పారిశుద్ధ్యం మ‌రింత మెరుగుప‌ర్చాల‌ని, మొక్క‌ల‌ను పెంచాల‌ని సూచించారు. మ‌రుగు నీటిని ఏవిధంగా శుద్ధి చేస్తున్నారో ప‌రిశీలించారు.

అనంత‌రం కాకుల‌కొండ ప్రాంతంలోని ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హణ ‌(సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి త‌యారుచేసిన ఎరువును ప‌రిశీలించారు. భూమిలో కుళ్ళ‌ని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను విభ‌జించి ప్యాకింగ్‌తో త్వ‌రిత‌గ‌తిన తిరుప‌తికి త‌ర‌లించాల‌న్నారు. త‌రువాత డంపింగ్ యార్డుల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, డిఇ శ్రీ ర‌విశంక‌ర్‌రెడ్డి, ఇఇ శ్రీ శ్రీ‌హ‌రి, ఆరోగ్య అధికారి డా.శ్రీ‌దేవి, గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు ఈ త‌నిఖీల్లో పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.