RESTRICTIONS ON TWO WHEELER MOVEMENTS _ తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు
Tirumala, 12 August 2024: TTD has taken a decision to allow the movement of two-wheelers on both the Ghat Roads from 6am to 9pm only till September 2024. The restriction comes into force with immediate effect from Monday, August 12 onwards.
The decision has been taken in view of the safety of the devotees.
According to the Deputy Conservator of the Forests, TTD, the months of August and September happens to be the peak breeding season for wild animals.
As such, the wild beasts are often seen crossing roads along First Ghat Road.
To avoid the Human-Animal conflict in the interests of both the devotees as well the wild animals, TTD has decided to allow the two-wheelers to ply on both the first and second Ghat roads only from 6am to 9pm till 30.09.2024.
The devotees are requested to make note of this change and co-operate with TTD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు
• భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ నిర్ణయం
తిరుమల, 2024 ఆగస్టు 12: శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుండి వెంటనే అమలులోకి వస్తుంది.
టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపిన విధంగా, ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచుగా రోడ్లు దాటుతున్నాయి. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి, సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను మొదటి మరియు రెండవ ఘాట్ రోడ్‌లలో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
కావున భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.