REVIEW MEETING ON SV SARVASREYAS TRUST HELD _ ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్ పై ఈఓ సమీక్ష

Tirupati, 24 Aug 20: A review meeting on the activities of Sri Venkateswara Sarvasreyas Trust was held by TTD EO Sri Anil Kumar Singhal on Monday.
 
The meeting was held in the Chambers of TTD EO along with Additional EO Sri AV Dharma Reddy, Tirupati JEO Sri P Basant Kumar. Review laid focus on Sri Venkateswara Balamandir which functions under SV Sarvasreyas Trust especially during the Covid pandemic period.
 
The EO instructed the concerned officials to speedup the tender process to construct a separate Hostel building for SV Balamandir. He reviewed on the facilities being provided by TTD to the 443 inmates SV Balamandir and 169 students of SV Balamandir who are pursuing Higher Education outside and also the funds given to 11 specially abled students of Akshayakshetram-NGO meant for Physically Disabled and Mentally Challenged Children. 
 
Later the EO directed the Devastanams Educational Officer(DEO) Sri Ramana Prasad, to verify whether the students who have pursued Higher Education are getting quality education in the institutions they have joined. The EO also instructed him to evaluate an action plan to benefit more students to pursue Higher Education. 
 
JEO Medical and Education Smt Bhargavi, FACAO Sri Balaji, CMO Dr Narmada, Additional FACAO Sri Raviprasdudu were also present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  
ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్ పై ఈఓ సమీక్ష            

తిరుపతి 2020 ఆగ‌స్టు 24: ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్  కార్యకలాపాలపై  టీటీడీ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం సమీక్ష జరిపారు.    తిరుపతి పరిపాలన భవనంలోని తన చాంబర్లో  ఈ సమీక్ష నిర్వహించారు. 
 
ఈ ట్రస్ట్ ద్వారా టీటీడీ బాలమందిరం, శ్రవణం ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. బాలమందిరంలో 443 మంది విద్యార్థులకు కల్పిస్తున్న వసతి   సదుపాయలగురించి తెలుసుకున్నారు.  ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 169 మందికి నాణ్యమైన విద్య అందుతోందో లేదో పరిశీలించాలని డిఈఓను ఆదేశించారు.  బాలమందిరం నూతన హాస్టల్ భవనాల టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ట్రస్ట్ ద్వారా అక్షయక్షేత్రం బుద్ధి మాంద్యం, వికలాంగుల కేంద్రానికి చెందిన 11 మంది విద్యార్థులకు అందిస్తున్న సహాయం పై చర్చించారు. అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ బసంత్ కుమార్, జెఈఓ ( విద్య, ఆరోగ్యం) శ్రీమతి భార్గవి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి,  అదనపు సీఎఓ శ్రీ రవిప్రసాదుడు, డీఈఓ శ్రీ రమణ ప్రసాద్, సీఎంఓ డాక్టర్ నర్మద పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.