THIRD PHASE OF SUNDARAKANDA AKHANDA PATHANAM AT TIRUMALA ON AUGUST 27 _ ఆగస్టు 27 న సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 24 Aug. 20: The Third phase of Sundarakanda Akhanda Pathanam is all set to be performed at the Nada Neerajanam platform at Tirumala on August 27 in Tirumala. 

This will be for The Third Time, TTD is Conducting Akhanda Sundarakanda Pathanam while on July 7, the first feat was performed where in 211 Slokas from Prathama Sarga (First Chapter) were recited followed by rendition of 227 Shlokas from Dwitiya Sarga (Second Chapter) to Sapthama Sarga (Seventh Chapter) for the Second time on August 6. During the third phase, which is going to be held on Thursday, 182 Shlokas from Astama Sarga to Ekadasa Sarga (Eighth tto Eleventh Chapters) will be rendered. About 200 Vedic Scholars from Sri Venkateswara Vedic University, Rashtriya Sanskrita Vidya Peetham, Dharmagiri Veda Vignana Peetham etc. will participate.

It may mentioned here that, TTD has Commenced Sloka Parayanam in Nada Neerajanam Platform from April 10 onwards with a noble aim to waiveoff the ill effects of Corona Covid 19 Virus across the world. After the Darshan of Lord Venkateswara in Tirumala resumed to pilgrims from June 11 onwards, TTD has Commenced the recitation of Sundarakanda, one of the important chapters in the Epic Ramayana. In the TTD Published Sundarakanda, there are total 68 Sargas (Chapters) comprising 2821 Shlokas. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  
ఆగస్టు 27 న సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం
 
తిరుమల, 2020 ఆగ‌స్టు 24: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ  తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆగస్టు 27వ తేదీ గురువారం  సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉద‌యం 7 గంటల నుండి  సుందరకాండలోని 8వ సర్గ నుంచి 11వ  సర్గ వరకు ఉన్న 182  శ్లోకాలను అఖండ పారాయణం చేయనున్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠం,  వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేద పారాయణ దారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొననున్నారు.
 
 క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి  తిరుమ‌ల‌ నాద నీరాజ‌నం వేదిక‌పై టీటీడీ “యోగ‌వాశిష్ఠం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం‌ పారాయణం నిర్వహించింది.  భక్తులకు శ్రీవారి దర్శనం పునః ప్రారంభమైన జూన్ 11వ తేదీ  సుంద‌రకాండ పారాయణం ప్రారంభించింది. 
 
 జూలై 7 వ తేదీ సుందరకాండ  తొలి సర్గ లోని 211 శ్లోకాలతో అఖండపారాయణం నిర్వహించారు. ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న  227 శ్లోకాలతో ఆగస్టు 6వ తేదీ అఖండ పారాయణం నిర్వహించారు.  27వ తేదీ గురువారం మరోసారి అఖండ పారాయణం జరుపనున్నారు. కాగా టీటీడీ ప్రచురించిన సుందరకాండ పారాయణం పుస్తకంలో మొత్తం  68 సర్గలు 2821 శ్లోకాలు ఉన్నాయి.ఎస్వీబీసీ ప్రతిరోజూ ఇస్తున్న ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌లు  ఈ పారాయ‌ణం లో పాల్గొని విశేషంగా ఆదరిస్తున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.