REVIEW MEETING ON SVBC HELD BY EO _ ఎస్వీబీసీ ఛానల్ పై ఈవో సమీక్ష 

TIRUPATI, 23 FEBRUARY 2023: To spread the glory of Sri Venkateswara Swamy across the country through SVBC Hindi, TTD EO Sri AV Dharma Reddy on Thursday held an exclusive review meeting on the same.

Addressing the review meeting at his Chambers in TTD Administrative Building in Tirupati along with CEO SVBC Sri Shanmukh Kumar, Jio Vice-President (Mumbai)  and GM IT Sri Sandeep, the EO said, Sri Venkateswara Bhakti Channel was established with a prime motto to take various sevas, rituals, festivals, dharmic programmes that are being observed in Tirumala and other sub-temples of TTD in a big way to the door step of every devotee across the nation as a part of its noble mission of propagation of Hindu Sanatana Dharma. 

“Telugu, Tamil and Kannada channels of SVBC have already gained enormous popularity among the masses and Hindi SVBC also needs to receive the same response. For this, we need a platform like Jio in the Hindi-speaking areas to spread the information related to the various spiritual activities and programmes related to Sri Venkateswara”, he maintained.

Later he also directed the CEO SVBC to discuss with Jio over the possibility of introducing SVBC Hindi on the JioFiber platform and further popularising SVBC Online Radio.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీబీసీ ఛానల్ పై ఈవో సమీక్ష 
 
తిరుపతి, 2023 ఫిబ్రవరి 23: ఎస్వీబీసీ హిందీ ఛానల్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశమంతటా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ్‌కుమార్, జియో వైస్ ప్రెసిడెంట్(ముంబై),  ఐటి జిఎం శ్రీ సందీప్‌ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల, ఇతర అనుబంధ ఆలయాల్లో నిర్వహిస్తున్న వివిధ సేవలు, కైంకర్యాలు, పండుగలు, ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భక్తుని చెంతకు తీసుకెళ్లాలన్న ప్రధాన ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైందన్నారు.
 
ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ ఛానళ్లు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయన్నారు. ఎస్వీబీసీ హిందీ ఛానల్ కు కూడా ప్రాచుర్యం కల్పించేందుకు హిందీ మాట్లాడే ప్రాంతాలలో జియో వంటి వేదిక అవసరమన్నారు. జియో ఫైబర్ నెట్ ప్లాట్‌ఫారమ్‌లో ఎస్వీబీసీ  హిందీ ఛానల్ ను ప్రసారం చేయడం, ఎస్వీబీసీ ఆన్‌లైన్ రేడియోకు మరింత ప్రాచుర్యం కల్పించడంపై జియో అధికారులతో చర్చించాలని ఎస్వీబీసీ సిఈఓను ఆదేశించారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.