NEW DWAJA STHAMBHAM CONSECRATION CEREMONY HELD FOR CHENNAI SRI PAT _ చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట

చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట
 
 తిరుపతి, 2023 ఫిబ్రవరి 23: చెన్నైలోని జిఎన్‌ చెట్టి రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట గురువారం శాస్త్రోక్తంగా జరిగింది. 
 
టీటీడీ  పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శ్రీ ఎ జె శేఖర్‌ పాల్గొన్నారు.
 
ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభానికి రక్షాబంధనం, కళావాహనం చేసి నవధాన్యాలు, నవరత్నాలు, నవలోహాలతో ప్రతిష్ట చేశారు. అదేవిధంగా, కూర్మ, కుబేర, మహాలక్ష్మి యంత్రస్థాపన చేశారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
 

Tirupati,23 February 2023:  TTD organised a grand installation ceremony of the new Dwaja Sthambham at the Sri Padmavati temple which is under construction at GN Chetti Road in Chennai on Thursday.

Under the supervision of TTD Pancha Ratra Agama Advisor Sri Srinivasacharyulu, the holy event with Visvaksena Aradhana, Punyahavachanam, Kumbha Harati were carried out.

The erection of the Garudalwar flag pole with Nava Dhanya and Nava Ratnas was installed while Kubera, Koorma, Lakshmi Yantrams were also installed underneath.

From March 13-17 Maha Samprokshanam event will be observed.

TTD JEO Sri Veerabrahmam, Chennai local Advisory Committee President Sri AJ Sekhar, TTD CE Sri Nageswara Ra, SE Sri Satyanarayana, EE Sri Manoharam, DyEOs Sri Gunabhushan Reddy, Sri Subramaniam, Sri Selvam, VGO Sri Manohar and others were also present.

platform and further popularising SVBC Online Radio.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI