ELEVEN DAY RUDRA YAGAM COMMENCES _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా రుద్రయాగం ప్రారంభం
TIRUPATI, 19 NOVEMBER 2024: The eleven-day Rudra Yagam commenced on a grand religious note in Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday.
As part of it in the evening Rudra Trisati, Japam and Homam were performed.
This fete will conclude on November 29.
Temple officials, Grihasta devotees were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా రుద్రయాగం ప్రారంభం
తిరుపతి, 2024 నవంబరు 19: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 29వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేషదీపారాధన, హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.