SACRED FLOWER GARDENS FOR SRIVARI RITUALS _ శ్రీ‌వారి కైంక‌ర్యానికి పుష్ప ఉద్యాన‌వ‌నం

Tirumala, 3 Feb. 21: With an aim to enhance the beauty of the precincts of Tirumala and also for the sake of daily worship of Lord Venkateswara, TTD has developed yet another sacred flower gardens in Hill Town.

This is coming up in a five acres area land near Bata Gangamma temple at Tirumala by the Garden department under the directions of TTD EO Dr KS Jawahar Reddy in the supervision of Additional EO Sri AV Dharma Reddy with sponsorship by donors.

TTD is growing all traditional flowers like Marigold, Vrukshi Roja, Lily, Madurai Jasmine, Kanakambaram, Manu sampangi, Tulasi, panner leaves and other aromatic leaves that are used in daily puja of Lord.

The yield of these flowers and aromatic leaves will be available for pujas at Srivari temple from the months of April-May onwards.

TTD is also developing another Sri Venkateswara sacred flower garden atRs.1.5 crore by donors as depicted in Puranas in a 10-acre land near Shila Thoranam in Tirumala.

In this garden 25 varieties of aromatic plants including seven leaves Bananas plantation which are considered as most auspicious will also be grown apart from Tulasi, Darba, Sampangi, mango, Parijata etc.

Similarly the TTD is developing Sri Venkateswara sandalwood gardens and Red Sanders near Gogarbham dam.

The TTD gardens department and the Forest department are coordinating efforts to promote greenery with green leaves and flower plants along ghat roads, Alipiri and Srivari Mettu footpaths leading to Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి  కైంక‌ర్యానికి పుష్ప ఉద్యాన‌వ‌నం
 
తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 03: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కైంక‌ర్యాల‌కు అవ‌స‌ర‌మైన పుష్పాల‌ కోసం  తిరుమల బాట గంగమ్మ ఆల‌యం స‌మీపంలో శ్రీ‌వారి పుష్ప ఉద్యాన‌వ‌నాన్ని టిటిడి ఏర్పాటు చేసింది.
 
 టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి ఆదేశాల మేర‌కు, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో  దాత‌ల స‌హకారంతో గార్డెన్ విభాగం ఐదు ఎక‌రాల విస్తీర్ణంలో ఈ ఉద్యాన‌వ‌నాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సంప్ర‌దాయ పుష్పాలైన చామంతి, వృక్షి, రోజ, మ‌ధురై మ‌ల్లెలు, క‌న‌కాంబ‌రం, మాను సంపంగి, లిల్లీలు, తుల‌సీ, ప‌న్నీరు ఆకు, త‌దిత‌ర మొక్క‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ పుష్పాలను ఏప్రిల్‌, మే నెల‌ల నుండి శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు వినియోగించ‌నున్నారు.
 
అదేవిధంగా దాదాపు రూ.1.5 కోట్లతో తిరుమ‌ల క్షేత్ర పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీ‌వారి పుష్ప కైంక‌ర్యానికి వినియోగించే ‌మొక్క‌లతో శిలా తోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేశారు. ఇందులో ఏడు ఆకులు క‌లిగిన అర‌టితోపాటు, తుల‌సి, ఉసిరి, మోదుగ‌, జువ్వి‌, జ‌మ్మి, ద‌ర్భ‌, సంపంగి, మామిడి, పారిజాతం, క‌దంబం, రావి, శ్రీ‌గంధం, అడ‌వి మ‌ల్లి, మొగ‌లి, పున్నాగ‌, అశోక‌, పొగ‌డ‌, ఎ‌ర్ర గన్నేరు‌, తెల్ల గ‌న్నేరు, నాబి, మాదిఫ‌ల‌, బొట్టుగు‌, భాందిరా వంటి 25 రకాల మొక్కలు ఉన్నాయి.  గోగ‌ర్భం డ్యాం వ‌ద్ద శ్రీ వేంకటేశ్వర శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనంలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు.
 
శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు మ‌రింత ఆధ్యాత్మిక ఆనందాన్ని క‌ల్పించేందుకు దాత‌ల స‌హకారంతో తిరుమ‌ల‌లోని ఉద్యాన వ‌నాలను టిటిడి అభివృద్ధి చేస్తోంది. టిటిడి గార్డెన్‌, అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీ‌వారి మెట్టు మార్గంలోను విరివిగా మొక్క‌ల‌ను పెంచుతున్నారు.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.