SACRED UMBRELLA FESTIVAL HELD _ నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

TIRUMALA, 21 JULY 2021: The Chatrasthapanotsavam, erection of a new sacred umbrella at Narayanagiri Padalu also known as Srivari Padalu was performed with religious fervour at Tirumala on Wednesday.

According to temple legend, Narayanagiri happens to be the highest peak in the Seshachalam ranges and it is believed that Sri Venkateswara Swamy has first placed his divine feet on this holy hill before He chose Tirumala as His dwelling place in Bhooloka.

Even after several centuries “Srivari Padalu”, (holy feet of Srivaru) is clearly seen on this gigantic peak. TTD has been performing this Chatrasthapanotsavam for several decades.

As part of this sacred festival, after the second bell in Tirumala temple, a team of Archakas and office staff carried the holy materials required to offer special pooja to the divine feet of Srivaru situated on Mount Narayanagiri.

Snapana Tirumanjanam was offered to these holy feet with milk, curd, honey, tender coconut and sandal paste amidst chanting of Vedic hymns. Later a holy umbrella was kept near the Srivari Padalu. Afterwards, devotees were allowed and prasadam was also offered.

AEO Sri Lakshmaiah, Parupattedar Sri Gurappa, AVSO Sri Pawan Kumar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

తిరుమ‌ల‌, 2021 జులై 21: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత బుధ‌వారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు.

ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామ‌గ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా మేదరమిట్టకు చేరుకున్నారు. అక్క‌డి నుండి నారాయ‌ణ‌గిరికి విచ్చేశారు. ముందుగా శ్రీ‌వారి పాదాల‌కు తిరుమంజ‌నం చేప‌ట్టారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ త‌రువాత‌ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ఎవిఎస్వో శ్రీ ప‌వ‌న్‌కుమార్‌, పార్‌ప‌త్తేదార్ శ్రీ గుర్ర‌ప్ప త‌దిత‌రులు పాల్గొన్నారు.

———————————————————

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

పత్రికా ప్రకటన తిరుమ‌ల‌, 2021 జులై 21

నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత బుధ‌వారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు.