SAKSHATKARA VAIBHAVAM IN SKVST _ జులై 13 నుండి 15వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం

Tirupati, 7 Jul. 21: The annual Sakshatkara Vaibhavam fete will be observed in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram from July 13 to 15.

During these three days, there will be Snapana Tirumanjanam to Utsava Deities between 9am and 10:30am. in Ekantam due to Covid restrictions.

Koil Alwar Tirumanjanam in connection with this annual fete will be observed on July 8.

On July 16 there will be Paruveta Utsavam and Anivara Asthanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జులై 13 నుండి 15వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం

తిరుపతి, 2021 జులై 07: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జులై 13 నుండి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనుంది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆల‌య ముఖ మండ‌పంలో మూడు రోజుల పాటు ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా మొద‌టిరోజు రాత్రి 6 గంట‌లకు ఆల‌య ముఖ మండ‌పంలో స్వామివారిని పెద్ద‌శేష వాహ‌నంపై, రెండో రోజు హనుమంత వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హిస్తారు.

జులై 16న పార్వేట ఉత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం మరుసటి రోజైన జులై 16వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆల‌య ముఖ మండ‌పంలో ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఏకాంత‌గా ఆణివార ఆస్థానం, పార్వేట ఉత్సవం ఆస్థానం నిర్వహిస్తారు.

జులై 8న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జులై 8వ తేదీ గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.