SVBC IS A CHIEF TOOL TO TAKE FORWARD HINDU DHARMA PRACHARA-TTD EO _ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారానికి ఎస్వీబీసీ ఒక ఆయుధం శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ 13వ వార్షికోత్స‌వ స‌భ‌లో టిటిడి ఈవో

Tirupati, 7 Jul. 21: Describing Sri Venkateswara Bhakti Channel as a chief tool to take forward Hindu Sanatana Dharma in an effective manner among masses, TTD Dr KS Jawahar Reddy said, more spiritual programs are in offing.

Taking part in the 13th Anniversary of SVBC in Tirupati on Wednesday, the EO said, the role played by this channel in the last 12 years in Bhakti Prachara is noteworthy while in the past one and a half years is a memorable one as the numerous programs live telecasted by SVBC boosted confidence among devotees across the world who are gripped in fear waves due to Covid pandemic.

The literature of Vengamamba seen the light due to this channel. He said it is been directed to chalk out annual programmes to be telecasted in the channel to the concerned officials. The programmes should focus on Vedas, Puranas, Itihasa, Sanskrit, Gosamrakshana, Organic cultivation etc. The programmes of this nature will definitely enlighten different sections of society, he strongly opined.

The Hanuman Jayanthi programmes telecasted by this channel won accolades across the globe as soon as TTD declared Tirumala Anjanadri as the birthplace of Anjaneya. Similar way, we take up more and more spiritual programs in future through SVBC, he added.

The Chairman of SVBC Dr Saikrishna Yachendra said, under the stewardship of SVBC MD and Additional EO Sri AV Dharma Reddy, the channel has set a new record in establishing the highest TRP rating among devotional channels with unique spiritual programs in the last one and a half years, he maintained. In future also we are contemplating more and more such programs with a blend of our rich literature and classical music to be telecasted on SVBC”, he informed.

Later, prizes were given away to the winners among the staff of SVBC in the competitions held on the occasion of the 13th anniversary of the reputed devotional channel by delegates.

JEO Smt Sada Bhargavi, National Sanskrit University Vice-Chancellor Sri Muralidhara Sharma, SVBC CEO Sri Suresh Kumar, Director Sri. Srinivasa Reddy, Chief Audit Officer Sri Seshasailendra, PRO Dr T Ravi were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారానికి ఎస్వీబీసీ ఒక ఆయుధం

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ 13వ వార్షికోత్స‌వ స‌భ‌లో టిటిడి ఈవో

తిరుపతి, 2021 జులై 07: శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వైభ‌వం, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఒక ఆయుధం లాంటిద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. ఎస్వీబీసీ 13వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా బుధ‌వారం ఛాన‌ల్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌భ‌కు ఈవో ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ క‌రోనా ప్ర‌పంచాన్ని ఇబ్బంది పెట్టినా ఎస్వీబీసీ ఉధృతంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు అవ‌కాశం ల‌భించింద‌న్నారు. ప్ర‌పంచ ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వ‌హిస్తున్న అనేక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష ప్రసారం ద్వారా ప్ర‌జ‌ల ఇళ్ల‌కు చేర్చ‌డంతో పాటు అనేక కొత్త కార్య‌క్ర‌మాల‌కు ఎస్వీబీసీ శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ఏడాదిన్న‌ర కాలంగా ఎస్వీబీసీ రేటింగ్ ఉన్న‌త స్థానానికి వెళ్ల‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. వేదాలు సామాన్య ప్ర‌జ‌ల‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలియ‌జేసే కార్య‌క్ర‌మాలు ఎస్వీబీసీ ద్వారా ప్ర‌సారం చేస్తున్నామ‌న్నారు. త‌రిగొండ వెంగ‌మాంబ సాహిత్యం ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డం ఎస్వీబీసీ ద్వారానే సాధ్య‌మైందని చెప్పారు.

ఛాన‌ల్ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ఏడాది పాటు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. వేదాలు, పురాణాలు, సంస్కృతం, గోసంర‌క్ష‌ణ‌, సేంద్రియ వ్య‌వ‌సాయం లాంటి అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేలా కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు. మాస వైశిష్ట్య కార్య‌క్ర‌మాలు పిల్ల‌ల‌కు తెలుగు నేర్చుకోవ‌డానికి, పురాణాల్లో పాత్ర‌ల గురించి తెలుసుకోవ‌డానికి, ఇతిహాసాల గురించి అవ‌గాహ‌న పెంచుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేయ‌డం ద్వారా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని కొత్త పుంత‌లు తొక్కించ‌వ‌చ్చ‌ని ఈవో అభిప్రాయ‌ప‌డ్డారు.

తిరుమ‌ల శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని పండితుల క‌మిటీ ప్ర‌క‌టించిన అనంత‌రం టిటిడి తొలిసారి నిర్వ‌హించిన హ‌నుమ‌జ్జ‌యంతి కార్య‌క్ర‌మాల‌ను ఎస్వీబీసీ ప్ర‌జ‌ల్లోకి చ‌క్క‌గా తీసుకెళ్లింద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఈవో వివ‌రించారు. త్వ‌ర‌లో హిందీ, క‌న్న‌డ ఛాన‌ళ్ల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ఎస్వీబీసీ అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందిస్తామ‌ని ఈవో చెప్పారు.

ఛాన‌ల్ ఛైర్మ‌న్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ ఛాన‌ల్ ఎండి శ్రీ ధ‌ర్మారెడ్డి నాయ‌క‌త్వంలో అంద‌రి స‌హ‌కారంతో ఎస్వీబీసీ అనేక కొత్త కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ప్ర‌జ‌ల్లో ఆధ్యాత్మిక చింత‌న పెంచేందుకు ఛాన‌ల్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో సంగీత సాహిత్య ప్ర‌ధాన కార్య‌క్ర‌మాలు కూడా ఎస్వీబీసీ ప్ర‌సారం చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఎస్వీబీసీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాస‌రెడ్డి, టిటిడి చీఫ్ ఆడిట్ ఆఫీస‌ర్ శ్రీ శేష శైలేంద్ర‌, ప్ర‌జాసంబంధాల అధికారి డా. టి.ర‌వి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఈవో, జెఈవో, ఎస్వీబీసీ ఛైర్మ‌న్‌తోపాటు అతిథుల‌ను స‌త్క‌రించారు. 13వ వార్షికోత్సవం సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఆట‌ల పోటీల్లో విజేత‌లైన ఉద్యోగుల‌కు అతిథులు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.